Begin typing your search above and press return to search.

నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బేబీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 9:27 AM GMT
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బేబీ
X
కెరీర్‌ ఆరంభం లో కేవలం గ్లామర్‌ పాత్రల్లోనే నటించిన దీపిక పదుకునే ఈమద్య కాలంలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తోంది. పద్మావత్‌ చిత్రం తర్వాత మరోసారి ఛాపాక్‌ చిత్రంలో యాసిడ్‌ దాడి కి గురి అయిన బాధితురాలి పాత్రలో నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇలాంటి డీ గ్లామర్‌ రోల్స్‌ ను చేసేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అంటూ ఈమెను చాలా మంది అభినందిస్తున్నారు.

ఇక తాజాగా దావోస్‌ లో జరుగుతున్న అంతర్జాతీయ ఎకనామి సదస్సులో ఈమెకు క్రిస్టల్‌ అవార్డు దక్కింది. ఈమె చేసిన సేవా కార్యక్రమాలు మరియు సినిమాలకు గాను ఈమెకు ఈ పురస్కారం దక్కినట్లు గా తెలుస్తోంది. అవార్డు అందుకుంటున్న ఫొటోను సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేసిన దీపిక తన ఆనందాన్ని ఫాలోవర్స్‌ తో షేర్‌ చేసుకుంది.

దీపిక ఫొటోపై ఆమె భర్త రణ్‌ వీర్‌ సింగ్‌ స్పందించాడు. భార్య సాధించిన అవార్డు పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. నేను గర్వించేలా నువ్వు చేశావు బేబీ అంటూ పోస్ట్‌ చేశాడు. దీపిక అవార్డు అందుకుంటున్న ఫొటోలో చాలా అందంగా ఉందని కొందరు.. ఆమె లో కాన్ఫిడెన్స్‌ కనిపిస్తుందని మరికొందరు కామెంట్స్‌ చేశారు. దీపిక ఇలాంటి అవార్డులు మరిన్ని అందుకోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది కామెంట్స్‌ చేశారు.