Begin typing your search above and press return to search.

టీమిండియా మాజీపై మ్యారీడ్ లేడీ ల‌వ్‌!

By:  Tupaki Desk   |   15 Dec 2019 7:41 AM GMT
టీమిండియా మాజీపై మ్యారీడ్ లేడీ ల‌వ్‌!
X
పెళ్ల‌యినా.. మ‌రో పెళ్ల‌యిన యువ‌కుడు అంటే ఇష్టం అని వ్యాఖ్యానించ‌డం క‌రెక్టేనా? స‌నాత‌న భార‌త సాంప్ర‌దాయం ఒప్పుకుంటుందా? మ‌నోభావాలు దెబ్బ తినే స‌నాత‌న ధ‌ర్మం మ‌న‌కు ఉన్నా.. అత‌గాడంటే క్ర‌ష్ అనేంతగా డీటెయిలింగ్ ఇచ్చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ భామ‌పై నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఎవ‌రా క్రికెట‌ర్.. ఎవ‌రీ భామ‌? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

లేటెస్టుగా ఓ ఇంట‌ర్వ్యూలో బాలీవుడ్ అందాల‌ హీరోయిన్ దీపిక పాదుకొణే మాట్లాడుతూ ఫ‌లానా క్రికెట‌ర్ అంటే చాలా ఇష్టం అంటూ బాహాటంగా చెప్ప‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే ఓ క్రికెట్ లైవ్ షోకి భ‌ర్త ర‌ణ‌వీర్ తో క‌లిసి వెళ్లిన దీపిక త‌న‌కిష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రు? పెళ్లికి ముందు బాగా ఇష్ట‌ప‌డిన‌ వ్య‌క్తి ఎవ‌రు? అంటే రాహుల్ ద్రావిడ్ అంటూ ముందూ వెన‌కా ఆలోచించ‌కుడా చెప్పేసి షాకిచ్చింది. క్రికెట్ చూస్తున్న‌ప్ప‌టి నుంచి అత‌నంటే ఇష్ట‌మ‌ని తెలిపింది. బెంగుళూరుకు చెందిన ద్రావిడ్ నాతో పాటు ఎంతో మంది క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. ద్రావిడ్ ఓపిక‌.. స‌హనం ఎంతో గొప్ప‌ది. ఆయ‌న్ని అంత గొప్ప‌ క్రికెట‌ర్ ని చేయ‌డంలో ఆ రెండు కీల‌క‌ పాత్ర పోషించాయ‌ని త‌న అభిప్రాయం చెప్పుకొచ్చింది. బ‌య‌ట ఎలా ఉంటారో? గ్రౌండ్ లోనూ ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా అంతే నేర్పుగా.. ఓర్పుగా ఉండే క్రికెట‌ర్ బ‌హుశా ఈ ప్ర‌పంచంలో అత‌నొక్క‌డే అయి ఉంటాడు... అంటూ రాహుల్ పై త‌న డీప్ స్ట‌డీని బ‌య‌ట‌పెట్టింది డిప్స్.

ర‌ణ‌వీర్ తో పెళ్లైన త‌ర్వాత ఇద్ద‌రం క‌లిసి క్రికెట్ చూడ‌టం మొద‌లు పెట్టాం. ద్రావిడ్ గురించి ర‌ణ‌వీర్.. నేను ఎప్పుడు మాట్లాడుకుంటుంటామ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం దీపిక ప‌దుకొణే యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ రాయ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోన్న `చ‌పాక్` అనే సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఆ సినిమా ట్రైల‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. రిలీజ్ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు ఎదురు చూస్తున్నారు.

మిస్ట‌ర్ డిపెండ‌బుల్.. టీమిండియా గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఆట‌గాడిగా విదేశీ ఆట‌గాళ్లు.. కోచ్ ల‌తో ప్ర‌శ‌లందుకున్న దిగ్గ‌జం అత‌డు. ఇడియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ద్రావిడ్ ఓ అధ్యాయం. నేటి త‌రం క్రికెట్ లో గొప్ప బ్యాట్స్ మెన్ల‌ను దేశానికి అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క క్రికెట్ బోర్డులో కీల‌క ప‌ద‌విలో కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం టీమిండియా క్రికెట్ లో స్థిరంగా రాణిస్తున్న కే.ఎల్.రాహుల్ కి ద్ర‌విడ్ గురువు అన్న సంగ‌తి తెలిసిందే.