షాకింగ్: నయనతారకు సవతి పోరు!

Fri Jun 24 2022 11:04:16 GMT+0530 (IST)

Deepika Padukone Comes In Nayantara Film

ప్రేమించిన యువకుడు విఘ్నేష్ ని పెళ్లాడిన నయనతార హ్యాపీ రొమాంటిక్ లైఫ్ ని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ఈ సవతి పోరు ఏమిటీ? అంటారా.. ! అయితే ఇది వ్యక్తిగత కుటుంబ జీవితానికి సంబంధించినది కాదు. వెండితెరపై సవతి పోరుకు సంబంధించిన వ్యవహారం.  కాస్త డీటెయిల్డ్ గా వెళితే..తలైవి నయనతార ప్రస్తుతం కింగ్ ఖాన్ సరసన 'జవాన్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమాతోనే నయన్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం మేరకు..  ఖాన్- నయనతార మధ్యలో దీపిక ప్రవేశించిందని తెలిసింది. 'జవాన్' చిత్రంలో దీపికా పదుకొణె భాగం కానుంది. అతిథి పాత్రనే అయినా కానీ ఎంతో కీలకంగా ఉంటుందట.

దీపికా పదుకొణెతో ప్రస్తుతం షారుఖ్ ఖాన్ - అట్లీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇది పూర్తి స్థాయి పాత్ర కాదు. అతిధి పాత్ర అయినా కానీ 'జవాన్' కోసం మరో ఆలోచన లేకుండా దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు. తాజా గుసగుసల మేరకు.. షారుఖ్ ఖాన్ ఇటీవల హైదరాబాద్ లో దీపికా పదుకొణెను కలిశాడు. రామోజీ ఫిలింసిటీలో షారూక్ జవాన్ షూటింగ్ లో ఉన్నాడు. అలాగే దీపిక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ లో ఉంది. అదే క్రమంలో ఆ ఇద్దరి భేటీ తటస్తించిందని చెబుతున్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ లో జంటగా నటించిన ఈ జోడీ నడుమ చర్చలు సాగాయి. ముఖ్యంగా దీపిక పోషించబోయే పాత్ర గురించి.. సినిమా కంటెంట్ గురించి క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. దీపిక షెడ్యూల్ తేదీలు కూడా లాక్ అయ్యాయట. పక్షం రోజుల్లో డీల్ లాక్ కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దగ్గుబాటి రానాని తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. రానా యే జవానీ హై దీవానీలో దీపికా పదుకొణెతో కలిసి అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసినదే. అయితే భళ్లాలుడు తొలిసారి బాద్ షా షారూక్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకోనున్నాడు.

ఆసక్తికరంగా.. షారుఖ్ ఖాన్ పఠాన్ లోనూ దీపిక పదుకొనే నటిస్తోంది. జవాన్ లో సన్యా మల్హోత్రా.. సునీల్ గ్రోవర్ తదితరులు నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ 2 జూన్ 2023న విడుదల కానుంది.

సిద్ధార్థ్ ఆనంద్ తో పఠాన్.. రాజ్‌కుమార్ హిరాణీతో డుంకీ .. అట్లీతో జవాన్ వంటి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లతో షారూఖ్ మళ్లీ వార్ లోకి దూసుకొస్తున్నాడు. జవాన్ లో తొలిసారిగా సౌత్ నటి నయనతారతో కలిసి నటించడం చర్చకు వచ్చింది. జవాన్ తో పాన్ ఇండియా స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.