ఏడాది ముగింపులో స్టార్ హీరోయిన్ బిగ్ ట్రీట్

Sat Dec 10 2022 09:46:42 GMT+0530 (India Standard Time)

Deepika Padukone Big treat at the end of the year

2022కి భాయ్ చెప్పి 2023లో అడుగుపెట్టేందుకు ఇంకెంతో సమయం లేదు. గతంలోని తీపి జ్ఞాపకాలు చేదు గుళికలను విశ్లేషించుకుని గతః భవిష్యత్ ఏంటి? అనేదే నేటితరం ఎజెండాగా కనిపిస్తోంది. అలాగే లైఫ్ ని ఫుల్ గా చిల్ చేయడమెలానో నిరంతరం ఆలోచించే యువతరం డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్ మూడ్ లో ఉందిప్పుడు. అయితే అలాంటి యువతకు మిడ్ నైట్ ఫుల్ ట్రీటిచ్చేందుకు పలు నిర్మాణ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని తెలిసింది.ఇకపోతే డిసెంబర్ 31 మిడ్ నైట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక నుంచి బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ ట్రీట్ అందనుందనే గుసగుస వినిపిస్తోంది. ఇది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అన్న గుసగుస కూడా ఉంది.  డిసెంబర్ 31 మిడ్ నైట్ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రాజెక్ట్ కే బృందం అద్భుతమైన టీజర్ ని అందిస్తుందని ప్రభాస్- దీపిక జంట అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

అయితే సంవత్సరం ముగింపునకు చాలా ముందే దీపిక పఠాన్ రూపంలో మరో ట్రీట్ కి రెడీ అవుతోంది. కింగ్ ఖాన్ షారూక్ తో కలిసి దీపిక 'పఠాన్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదటి పాటను డిసెంబరు 12న విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. షారుఖ్ ఖాన్- దీపికా పదుకొణె- జాన్ అబ్రహం లాంటి భారీతారాగణం నటిస్తున్న పఠాన్ పై భారీ అంచనాలున్నాయి.

ఇందులో ఆద్యంతం కట్టి పడేసే డ్యాన్స్ నంబర్ 'బేషరం రంగ్' పాటతో హీట్ పెంచేందుకు టీమ్ సిద్ధమవుతోందని నిర్మాతలు తాజాగా వెల్లడించారు. ఈ పార్టీ సాంగ్ లో దీపిక కిల్ చేసే చిల్లింగ్ లుక్ లో కనిపిస్తుందని ..  దీపికా పదుకొనే కెరీర్ లోనే హాటెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. షారూఖ్ ఖాన్ తో దీపిక స్టీమీ కెమిస్ట్రీ యూత్ ని కట్టి పడేస్తుందనేది గుసగుస.

ఇక ఈ ఏడాదిలో దీపిక నటిస్తున్న ప్రాజెక్ట్ కే.. పఠాన్ చిత్రాలు రెండూ జానర్ వైవిధ్యంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఫాంటసీ నేపథ్యంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో రక్తి కట్టించనుంది. ఇది న్యూఏజ్ జానర్ సినిమాగా చరిత్రకెక్కనుందని అభిమానులు భావిస్తున్నారు. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోను ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి.  

పఠాన్ పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్. రహస్య ఏజెంట్ కథతో తెరకెక్కించారని రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. పఠాన్ చిత్రం ఆడ్రినలిన్ పంపింగ్ స్టంట్ లతో రక్తి కట్టించనుందని ... షారుఖ్ ఖాన్ శత్రువులను చంపడానికి లైసెన్స్ డ్ తుపాకీ పట్టుకునే గూఢచారి పాత్రను పోషిస్తాడని టాక్ ఉంది. కానీ మేకర్స్ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. జనవరి 25న ఈ చిత్రం హిందీ- తమిళం - తెలుగు భాషల్లో విడుదల కానుంది. డిసెంబర్ 31 మిడ్ నైట్ ప్రమోషన్స్ కోసం పఠాన్ బృందం ప్రణాళికలు రచిస్తోందని తెలిసింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.