ఫెమినా కవర్ పై దీపికను మించి..!

Wed Oct 09 2019 13:19:26 GMT+0530 (IST)

Deepika Padukone, PV Sindhu, Kiran Mazumdar Sizzles on Femina Cover Page

సినిమా స్టార్లను మించి బ్యాడ్మింటన్ స్టార్లు పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తుండడం నేటి ట్రెండ్. అందాల సానియా మీర్జా ఈ ట్రెండ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు మరో బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తననే అనుసరిస్తోందని తాజాగా రివీల్ చేసిన కవర్ పోస్టర్ చెబుతోంది. ప్రఖ్యాత ఫెమీనా మ్యాగజైన్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లేటెస్ట్ కవర్ పేజీపై దీపిక-పీవీ సింధు-కిరణ్ మజుందార్ షా ఫోటోషూట్ ని ప్రింట్ చేసింది. ఈ కవర్ పేజీ సంథింగ్ స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది.ప్రత్యేక కవర్ ఎడిషన్ కాబట్టి.. విభిన్న రంగాలకు చెందిన ఓ ముగ్గురిని ఎంపిక చేసి ఈ ఫోటోషూట్ చేశారు. దీపిక పదుకొనే- పివి సింధు- కిరణ్ మజుందార్ షా ఈ ముగ్గురూ  తాము ఎంచుకున్న రంగాల్లో గొప్ప స్థాయికి చేరినవారే. అందుకే ఫెమినా తన 60 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆ ముగ్గురి ముఖచిత్రంతో స్పెషల్ ఇష్యూ కవర్ ని డిజైన్ చేసింది. ఈ ముగ్గురూ సంథింగ్ స్పెషల్. అత్యున్నత శిఖరాల్ని చేరిన ధీరవనితలే కావడంతో కవర్ పేజీకి అంతే అందం వచ్చింది.

దీపిక ఎంతో సింపుల్ గా అందంగా బ్రౌన్ కలర్ దుస్తుల్లో కనిపించింది. జాకెట్‌తో లేయర్డ్ చేసిన డిజైనర్ డ్రెస్ ని ధరించింది. మిగతా ఇద్దరు బ్రౌన్ షేడ్ డ్రెస్ లు ధరించారు. పీవీ సింధు సంథింగ్ స్పెషల్ గా గ్లామరస్ గానూ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే దీపికను మించి కనిపిస్తోంది. ఆ ముగ్గురి డ్రెస్ డిజైన్ కి కాఫీ  బ్రౌన్ కలర్ గ్రేడింగ్ కామన్ గా కనిపించడం మరో హైలైట్. ఈ తరహా ఫోటోషూట్లు దీపికకు కొత్తేమీ కాదు కానీ పీవీ సింధుకి మాత్రం కొత్తనే. కానీ ఇటీవల అంతకంతకు అనుభవం పెరుగుతోందనే చెప్పాలి.

దీపిక నటించిన ఛపాక్ 10 జనవరి 2020 న విడుదల కానుంది. యాసిడ్ దాడి బాధితుడు లక్ష్మి అగర్వాల్  నిజ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. కపిల్ దేవ్ బయోపిక్ 83 లో భర్త రణవీర్ సింగ్ తో కలిసి నటించింది. ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10 న విడుదల కానుంది. అలాగే పీవీ సింధు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ విలన్ సోనూసూద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.