డిసెంబర్ సినిమాలకు బజ్ లేదేంటి?

Tue Nov 19 2019 07:00:02 GMT+0530 (IST)

December Movies Releases in Telugu Film Industry

డిసెంబర్ లో ఓ పది సినిమాలు సినిమాలు థియేటర్స్ లోకొస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన సినిమాలు. ముందుగా కార్తికేయ '90 ml' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ ఎలెమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అవుతోంది. వరుస ఫ్లాపుల అందుకున్న కార్తికేయ ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. కానీ ఆడియన్స్ కి ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అనే విషయమే తెలియదు.శ్రీనివాస్ రెడ్డి అండ్ టీం చేసిన ప్రయత్నం 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అనే సినిమా డిసెంబర్ 6 న థియేటర్స్ లోకి వస్తుంది. ఇంత వరకూ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అదే రోజు మరో నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. కానీ వాటి టైటిల్స్ కూడా ప్రేక్షకులకు తెలియవు.

ఇక డిసెంబర్ ఎండింగ్ లో బాలయ్య 'రూలర్' తో పాటు సాయి ధరం తేజ్ 'ప్రతి రోజు పండగే' అలాగే రాజ్ తరుణ్ 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో రూలర్ - ప్రతి రోజు పండగే సినిమాలు మాత్రమే ప్రమోషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మార్కెట్ పరంగా ఇంకా బజ్ మాత్రం రావట్లేదు. 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాకు సరైన ప్రమోషన్స్ లేవు. ఇక 'వెంకీ మామ' - 'నిశ్శబ్దం' సినిమాలు డిసెంబర్ లోనే అంటున్నా ఇంతవరకూ విడుదల తేదిలే ప్రకటించలేదు.ఇలా ప్రమోషన్స్ చేస్తున్నా వచ్చే నెలలో విడుదలయ్యే సినిమాలకు ఏ మాత్రం బజ్ రావట్లేదు. ఇక రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ చేసేలా ఏవైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.