సీనియర్ హీరోయిన్ అవయవదానం పై చర్చ

Mon Aug 15 2022 17:00:43 GMT+0530 (IST)

Debate on senior heroine organ donation

టాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ మీనా ఇటీవల అవయవ దానంపై అవగాహణ కల్పిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. అవయవ దానం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు ఆమె కూడా అవయవ దానం చేసేందుకు సిద్ధం అయినట్లుగా పేర్కొంది. ప్రతి ఒక్కరు కూడా అవయవ దానం చేయడం వల్ల మళ్లీ జన్మించినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు.మీనా భర్త సాగర్ ఇటీవల తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే. దీర్ఘ కాలిక ఆ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సాగర్ కి నివాళి అన్నట్లుగా మీనా అవయవదానం యొక్క అవగాహన కార్యక్రమం ను మొదలు పెట్టారు.

ప్రాణాలు రక్షించేందుకు అవయవ దానం గొప్ప మార్గం. ఇది అందరికి కూడా ఉన్న ఒక అద్భుతమైన వరం అన్నట్లుగా మీనా తెలియజేశారు.

ఒక్కో మనిషి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అవయవదానం కు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అవయవ దానం అనేది దాతలు మరియు గ్రహీతల మధ్య మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి మధ్య సన్నిహిత సంబంధాలు కలిగిస్తుంది.. అంతే కాకుండా సమాజంలో మంచికి దారి తీస్తుంది.

ఈ రోజు నేను నా అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను.. మీరు కూడా నాతో పాటు అవయవదానం కు ప్రతిజ్ఞ చేయండి అంటూ మీనా విజ్ఞప్తి చేసింది.

ఊపిరితిత్తుల సమస్యతో సాగర్ జూన్ 28వ తారీకున మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మరణం సమయంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లకు మీనా సోషల్ మీడియా ద్వారా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.