యాంకర్ ఫోటోలు డేటింగ్ యాప్ లో ప్రత్యక్ష్యం

Wed May 27 2020 11:15:30 GMT+0530 (IST)

Dating Apps misused anchor Manjusha Photos

సెలబ్రెటీల ఫొటోలు అప్పుడప్పుడు డేటింగ్ యాప్ లో కనిపించడం సర్వసాదారణం. అనుమతులు లేకుండానే చాలా సార్లు డేటింగ్ యాప్స్ సెలబ్రెటీల ఫొటోలను వాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈసారి తెలుగు యాంకర్ మంజుషా ఫొటోలు డేటింగ్ యాప్ లో ప్రత్యక్ష్యం అయ్యాయి. గుర్తు తెలియని కొందరు మంజుషా ఫొటోలను డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. విషయం మంజుషా కు తెలిసి వెంటనే స్పందించింది.తన ఫొటోలను అనుమతి లేకుండా ఉపయోగించడంతో పాటు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు యాప్స్ పై చర్యలకు మంజుషా సిద్దం అయ్యింది. ఆ యాప్స్ ను తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఉపయోగించవద్దని.. ఆ యాప్స్ యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ ఆమె పేర్కొంది.

బుల్లి తెరపై యాంకర్ గానే కాకుండా నటిగా కూడా పలు సినిమాల్లో కనిపించిన మంజుషా మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బుల్లి తెర మరియు వెండి తెరలపై ఛాన్స్ కోసం ఈ విపత్తు సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి వర్కౌట్స్ చేసి మంచి ఫిజిక్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.