Begin typing your search above and press return to search.

ద‌స‌రా గిఫ్ట్: ప‌ప్పు సేన పై ప్ర‌తీకారం తీర్చుకున్న కంగ‌న‌

By:  Tupaki Desk   |   25 Oct 2020 9:30 AM GMT
ద‌స‌రా గిఫ్ట్: ప‌ప్పు సేన పై ప్ర‌తీకారం తీర్చుకున్న కంగ‌న‌
X
కంగ‌న ర‌నౌత్ వ‌ర్సెస్ శివ‌సేన ఎపిసోడ్స్ తెలిసిన‌వే. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాధీశులు కంగ‌న ఆఫీసు ఇంటిని కుప్ప‌కూల్చేందుకు బీఎంసీని ఉసిగొల్ప‌గా.. కార్యాల‌యాన్ని పాక్షికంగా కూల్చేశారు. ఆ ఎపిసోడ్ పై కంగ‌న కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిన‌దే. ముంబై పై అనుచిత వ్యాఖ్య‌ల ప‌ర్య‌వ‌సాన‌మిది. ప్ర‌స్తుతం కంగ‌న మ‌నాలిలో నివ‌శిస్తోంది. అయితే శివ‌సేన‌ను ప‌ప్పు సేన అంటూ ఉడికిస్తూ కంగ‌న డేర్ చూపించ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది.

నేడు విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా పప్పు సేన‌కు త‌న‌దైన శైలిలో రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చింది క్వీన్. దసరా కోసం అలంకరించిన ముంబై కార్యాలయం చిత్రాలను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది. అంతేకాదు.. శివ‌సేన అధినాయ‌కుడు సంజయ్ రౌత్ పై మ‌రోసారి పంచ్ లు విసురుతూ కాలు దువ్వింది. సోషల్ మీడియాలో కంగనా రనౌత్ రెండు ఫోటోలను పంచుకున్నారు. అభిమానులకు అనుచరులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పాక్షికంగా కూల్చివేసిన కార్యాలయాన్ని అలంక‌రించిన‌ చిత్రాలను పంచుకోవ‌డం హీట్ పెంచింది. ఒక ఫోటో అమ్మ‌వారి విగ్రహం చిత్రం కాగా.., మరొకటి ముంబైలోని ఆమె కార్యాలయ స్థలం ప్ర‌ధాన గ్రీన్ గేట్, ..దీనిని బిఎంసి పాక్షికంగా కూల్చివేసింది.

``మీ చెదిరిన కల.... మీ ముఖంలో నవ్వు లేదు.. పప్పు సేన నా ఇంటిని నాశ‌నం చేయగలదు.. కానీ నా ఆత్మను కాదు... బంగ్లా నంబర్ 5 చెడుపై మంచి విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటోంది # హ్యాపీ ద‌స‌రా`` అంటూ రౌత్ పై కాలు దువ్వింది క్వీన్. ఇంత‌కీ ప‌ప్పు సేన రిప్ల‌య్ ఎలా ఉండ‌బోతోందో చూడాలి. ఇప్ప‌టికే కంగ‌న పై రెండు క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి.