Begin typing your search above and press return to search.

కాపురంలో క‌ల‌త‌ల‌తో హీరోకి త‌ల‌నొప్పులు!

By:  Tupaki Desk   |   14 Aug 2019 4:11 AM GMT
కాపురంలో క‌ల‌త‌ల‌తో హీరోకి త‌ల‌నొప్పులు!
X
ఆలుమ‌గ‌ల మ‌ధ్య క‌ల‌త‌లు కెరీర్ పైనా ప్ర‌భావం చూపించ‌డం ఖాయం. ప్ర‌స్తుతం క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ స‌న్నివేశం అదే. స‌మ‌కాలీన హీరోల్లో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌న్ చాలాకాలంగా భార్య విజ‌య‌ల‌క్ష్మితో గొడ‌వ ప‌డుతున్నారని.. ఆ ఇద్ద‌రి కాపురంలో గొడ‌వ‌ల‌కు హీరోగారి ప్ర‌వ‌ర్త‌నే కార‌ణ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. ద‌ర్శ‌న్ ఎఫైర్లు(వివాహేత‌ర సంబంధాలు) కాపురంలో క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ని క‌న్న‌డ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా న‌టించిన `కురుక్షేత్ర‌` క‌న్న‌డ‌లో చ‌క్క‌ని విజ‌యం అందుకుంది. అయితే భార్య‌తో వివాదాలు మ‌రోసారి ర‌చ్చ‌కెక్క‌డంతో ఈ విజ‌యాన్ని ఆస్వాధించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌. దానిపై అభిమానుల్లోనూ చ‌ర్చ సాగుతోంది. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మ‌ళ్లీ గొడ‌వెందుకు? ఇటీవ‌ల క‌లిసిపోయి క‌లివిడిగా ఉన్నా ఎందుకిలా జ‌రుగుతోంది అంటూ అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. అన్నా-వ‌దినల కాపురం బావుండాల‌ని కోరుకుంటున్నారు.

ద‌ర్శ‌న్ - విజ‌య‌ల‌క్ష్మి దంప‌తుల మ‌ధ్య తాజా గొడ‌వ‌కు కార‌ణం ట్విట్ట‌ర్ ప్రొఫైల్ అని తెలుస్తోంది. విజయలక్ష్మి దర్శన్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌లో ఖాతా నుంచి దర్శన్‌ పదాన్ని తొలగించటంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా తిరిగి గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని ప్ర‌చార‌మైంది. ఇటీవ‌లే యజమాన సినిమా మేకింగ్‌ వీడియోలో దంపతులిద్దరూ కనిపించ‌డంతో మ‌నస్ఫ‌ర్థ‌లేవీ లేకుండా క‌లిసిపోయార‌ని భావించారంతా. కానీ ఇంతలోనే ఈ జంట మ‌ధ్య గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డ‌డం అభిమానుల్ని క‌ల‌త‌కు గురి చేసింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌ఖ్య‌త‌ను కుదిర్చేందుకు ఓ రాజ‌కీయ నాయ‌కుడు కం న‌టుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది.