Begin typing your search above and press return to search.

ద‌ర్బార్ ట్రైల‌ర్: ముంబైకి బ్యాడ్ కాప్ అదిరే ట్రీట్

By:  Tupaki Desk   |   16 Dec 2019 1:54 PM GMT
ద‌ర్బార్ ట్రైల‌ర్: ముంబైకి బ్యాడ్ కాప్ అదిరే ట్రీట్
X
ముంబై అంటేనే మాఫియా ప‌డ‌గ‌నీడ‌లో భ‌యం గుప్పిట్లో జ‌నం గ‌జ‌గ‌జ‌లాడాల్సిన ప‌రిస్థితి. అలాంటి చోటికి అరుణాచ‌లం లాంటి ఓ త‌ల‌తిక్క కాప్ న‌గ‌ర‌ క‌మీష‌న‌ర్ గా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో.. తెలియాలంటే ఇదిగో `ద‌ర్బార్` ట్రైల‌ర్ చూడాల్సిందే.

తంబీల కోసం మురుగ‌దాస్ అదిరిపోయే మాస్ మసాలా ట్రీట్ ని రెడీ చేస్తున్నార‌ని ఈ ట్రైల‌ర్ చెబుతోంది. ర‌జ‌నీ మార్క్ ఆహార్యం.. స్టైలింగ్ ప్ర‌తిదీ ఫాలో అయ్యి కాప్ స్టోరిని ఎంచుకున్నారు మురుగ‌. ఇక ర‌జ‌నీ ఈ ఏజ్ లోనూ అంత ఎన‌ర్జీని ఎలా చూపించ‌గ‌లుగుతున్నారు? అన్నది స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. 70 ఏజ్ లోనూ ర‌జ‌నీ అదే ఎన‌ర్జీతో ఆక‌ట్టుకుంటున్నారు. ఆ న‌డ‌క న‌డ‌తలో మ్యాన‌రిజంలో మాసిజం ఏమాత్రం కించిత్ త‌గ్గ‌లేదు. ఆ వాకింగ్ స్టైల్ కి త‌గ్గ‌ట్టే హ్యాండ్ మూవ్ మెంట్ .. హెయిర్ స్టైల్ .. ఖాకీలో మాసిజం వారెవ్వా! అనాల్సిందే. ర‌జ‌నీలోని మాస్ కాప్ ని అన్ని యాంగిల్స్ లో ఎలివేట్ చేస్తూ.. తంబీల‌కు విందు భోజ‌నం అందించేందుకు మురుగ‌దాస్ త‌పించాడ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఇక ఇందులో అందాల న‌య‌న‌తార‌తో ర‌జ‌నీ రొమాంటిక్ ల‌వ్ స్టోరి... మాస్ విల‌న్ సునీల్ శెట్టి తో వైరం.. ఇంటెలెక్చువ‌ల్ గేమ్ ఇవ‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ మ‌రోసారి విజువ‌ల్ రిచ్ మాస్ యాక్ష‌న్ సినిమా కోసం రాజీ లేకుండా బ‌డ్జెట్ ని వెచ్చించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమా కేవ‌లం త‌మిళ‌నాడులోనే వంద‌ కోట్లు వ‌సూలు చేస్తే మ‌లేషియా బాక్సాఫీస్ నుంచి భారీగా తెస్తుంద‌న్న లెక్క‌ల‌తో తెర‌కెక్కింది. అయితే తెలుగు- క‌న్న‌డ మార్కెట్ల‌లో రాణించ‌డం ప్ర‌స్తుతం ర‌జ‌నీకి అవ‌స‌రం. సంక్రాంతి రేసులో ఠ‌ఫ్ కాంపిటీష‌న్ న‌డుమ ర‌జ‌నీ-మురుగదాస్ ల `ద‌ర్బార్` రిలీజ‌వుతోంది. రేసులో మ‌హేష్‌.. బ‌న్ని సినిమాలు దూసుకొస్తున్నాయి. ఇత‌రుల‌కు ద‌ర్బార్ ఎంత‌వ‌ర‌కూ పోటీనిస్తుంది అన్న‌ది చూడాలి.