'వకీల్ సాబ్' నిర్మాత ఇంట్లో మహమ్మారి కలకలం!

Wed May 20 2020 08:13:47 GMT+0530 (IST)

Dangerous Disrease In Vakeelsaab Producer House

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిన వైరస్ విలయ తాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి మన దేశంలోని పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు. పోలీసు బలగాలు అహర్నిశలు సేవలందిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి అందాల తార శ్రీదేవి-బోనీ కపూర్ ఇంట్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే ఓ యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వెంటనే వైద్యులు అప్రమత్తమై బోని కపూర్ ఇంట్లో పని చేస్తున్న అందరి ఉద్యోగులను పిలిపించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ దెబ్బకి జాన్వీ కపూర్ బోణి కపూర్ షాక్ కి గురయ్యారు. కానీ టెస్టులు నిర్వహించాక రిజల్ట్ తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఇందులో కేవలం ఒక యువకుడికి మాత్రమే కరోనా వైరస్ సోకడంతో వెంటనే అతడిని దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత స్థలానికి తీసుకెళ్లారు. అంతేగాక మిగిలిన పనివాళ్లను కూడా కొంతకాలం పాటు గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు వైద్యులు. ఇక ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని.. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నోటికి మాస్కులు ధరించాలని చేతులను శుభ్రంగా శానిటైజర్లతో కడుక్కోవాలని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బోని కపూర్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమాకు.. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక హిందీలో విడుదలైన 'బాధై హో' అనే సినిమా రీమేక్ ను నిర్మిస్తున్నాడు.