Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లకు కరోనా!

By:  Tupaki Desk   |   7 July 2020 4:15 AM GMT
టాలీవుడ్ లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లకు కరోనా!
X
టాలీవుడ్ ను కరోనా చుట్టేస్తోంది. మెల్లి మెల్లిగా కీలక వ్యక్తులకు సోకడం మొదలైంది. ఇప్పుడు కరోనా విశ్వవ్యాప్తమైంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అందరికీ సోకుతోంది. ఇప్పటికే షూటింగ్ లు ప్రారంభమైన టీవీ ఇండస్ట్రీలో కరోనా సెగ తగిలింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చుట్టుముడుతోంది.

తాజాగా హైదరాబాద్ లో ఉండే ఇద్దరు ఆంధ్రాకోస్తా ఏరియా డిస్ట్రిబ్యూటర్లకు కరోనా సోకినట్టు వార్తలు వెలువడ్డాయి. మెగా ఫ్యామిలీకి చెందిన ఒకరు ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడట.. దీంతో ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా బెడ్లు ఖాళీ లేక ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నాడట.. మరో డిస్ట్రిబ్యూటర్ కూడా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది.

ఇక ఒక స్టార్ హీరో ఇటీవల మొదలుపెట్టిన సినిమా నిర్మాణ సంస్థలో చిరుద్యోగికి కరోనా సోకడంతో ఆ ఆఫీసును మూసేశారని తెలిసింది. దీంతో ఇప్పట్లో టాలీవుడ్ లో షూటింగ్ ల మాట దేవుడెరుగు.. ప్రస్తుతం కరోనా నుంచి తప్పించుకుంటే అదే చాలు అని టాలీవుడ్ జనాలు భయపడుతున్నారట..