Begin typing your search above and press return to search.

థియేటర్స్ ఓపెన్ అయితే డబ్బింగ్ సినిమాలు మాత్రమే ప్రదర్శించాలేమో..!

By:  Tupaki Desk   |   1 July 2020 7:50 AM GMT
థియేటర్స్ ఓపెన్ అయితే డబ్బింగ్ సినిమాలు మాత్రమే ప్రదర్శించాలేమో..!
X
కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ గత మూడున్నర నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగులు ఆగిపోయాయి.. థియేటర్స్ మల్టీప్లెక్స్ లు మూతబడి పోయాయి. ఇక సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు మాత్రం ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదని భావించి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీల లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య కొన్ని దేశాల్లో నిబంధనలు సడలిస్తూ అక్కడక్కడ థియేటర్స్ కూడా రీ ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమం లో మన దేశం లో కూడా కొన్ని షరతులతో షూటింగులకు అనుమతులిచ్చారు. కానీ థియేటర్స్ రీ ఓపెన్ చేయడం పై ఏ నిర్ణయం తీసుకో లేదు. ఇప్పుడు రోజు రోజు కి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముందు కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ వస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునేలా కనిపించడం లేదు. ఒక వేళ థియేటర్స్ ఓపెన్ అయినా ఒకప్పటిలా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం అంత ఈజీ కాదు.

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయినా సినిమాల రిలీజుల విషయం లో అనిశ్చితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఒకప్పుడు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ని నమ్మి తక్కువ అడ్వాన్స్ కే ప్రొడ్యూసర్స్ సినిమాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు క్రైసిస్ సమయంలో డిస్ట్రిబ్యూటర్స్ కి తక్కువ అడ్వాన్స్ కి సినిమాలు ఇచ్చే సిచ్యుయేషన్ కనిపించడం లేదు. ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి చెప్పేస్తున్నారట. అయితే డబ్బింగ్ సినిమా వాళ్లు మాత్రం ఎంతో కొంత వస్తే చాలు అనే రీతిన ఉన్నారట. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరోలు విజయ్ 'మాస్టర్'.. సూర్య 'ఆకాశమే నీ హద్దురా'.. ధనుష్ 'జగమే తంత్రం'.. విశాల్ 'చక్ర' సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ డబ్బింగ్ సినిమాలన్నీ థియేటర్స్ ఓపెన్ అయితే తెలుగు లో కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తే థియేటర్స్ తెరిస్తే తమిళ డబ్బింగ్ సినిమాలు ప్రదర్శించాలేమో అని డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచిస్తున్నారట.