Begin typing your search above and press return to search.

ఈ అమ్మడు చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచిస్తుందే

By:  Tupaki Desk   |   24 April 2020 5:15 AM GMT
ఈ అమ్మడు చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచిస్తుందే
X
హుషారు చిత్రంతో కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ దక్ష నగ్రీకర్‌. ఈ అమ్మడు అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. హుషారు తర్వాత హీరోయిన్‌ గా ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. అయితే వచ్చిన ప్రతి ఆఫర్‌ ను అందిపుచ్చుకోకుండా ఆచితూచి ఆఫర్లకు ఓకే చెబుతుందట. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే ఈ అమ్మడు హాట్‌.. క్యూట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారు దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.

ఇటీవల ఈ అమ్మడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ ఇంద్ర సినిమాలో చిన్న ఇంద్ర సేనా రెడ్డిగా నటించిన తేజ సజ్జ హీరోగా ఈ చిత్రంలో నటించబోతున్నాడు. తేజకు జోడీగా ఈ అమ్మడిని నటింపజేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ చిత్రంతో పాటు బెల్లంకొండ చినబాబు గణేష్‌ చిత్రంలో కూడా ఈ అమ్మడు ఒక చిన్న పాత్రలో కనిపించబోతుందట. వరుసగా వస్తున్న ఆఫర్లు కాదని నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ మెచ్యూర్డ్‌ గా ఈ అమ్మడు వ్యవహరిస్తుందని సినీ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మొదట సక్సెస్‌ దక్కించుకుని ఆ తర్వాత వరుసగా ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించి కొంత కాలంకే పలువురు హీరోయిన్స్‌ కనుమరుగయ్యారు. అలా తన కెరీర్‌ కావద్దనే ఉద్దేశ్యంతో దక్ష నగ్రీకర్‌ కాస్త హుషారుగా జాగ్రత్తగా సినిమాలకు కమిట్‌ అవుతూ వస్తోంది. ఈ అమ్మడి సినీ కెరీర్‌ ప్రస్తుతం మెల్లగా సాగుతున్నా కూడా ఇదే తరహాలో ఈ అమ్మడు జాగ్రత్తగా కెరీర్‌ ను ప్లాన్‌ చేసుకుంటే ఖచ్చితంగా మంచి పొజీషన్‌ కు వెళ్తుందని కాస్టింగ్‌ నిపుణులు చెబుతున్నారు.