Begin typing your search above and press return to search.

ఆ కారు మాది కాదు: రానా ఫ్యామిలీ క్లారిటీ

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:32 PM GMT
ఆ కారు మాది కాదు: రానా ఫ్యామిలీ క్లారిటీ
X
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ హైదరాబాద్‌లో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు గత సాయంత్రం కొన్ని వార్తలు మీడియాలో హల్చల్ చేసాయి. అయితే.. ఇది ఒక చిన్న ప్రమాదమని.. ఏ వ్యక్తికి పెద్ద గాయాలు కాలేదని తెలుస్తుంది. రహదారి ప్రమాదంలో అభిరామ్ ప్రమేయం లేదని దగ్గుబాటి కుటుంబం స్పష్టం చేసింది. ఈ సంఘటనలో నిజం లేదని దగ్గుబాటి ఫ్యామిలీ మీడియా పరంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. “ఆ కారు దగ్గుబాటి కుటుంబానిది కాదు. అలాగే అభిరామ్ కూడా ఎక్కడా ఎటువంటి ప్రమాదానికి గురవ్వలేదు. అనవసరమైన పుకార్లను ప్రచారం చేయవద్దని, అలాంటి పుకార్లు నమ్మవద్దని వారు మీడియాకు విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబంలో ఎవరికి ఏమి కాలేదు. అంతా ఆరోగ్యంగానే.. జాగ్రత్తగానే ఉన్నారని" రానా ఫ్యామిలీ స్పష్టం చేసింది.

ఈ ప్రకటనతో దగ్గుబాటి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దగ్గుబాటి ఫ్యామిలీ అంతా రానా మిహికల పెళ్లి జ్ఞాపకాలలోనే ఉన్నారు. పెళ్ళికి ముందు నుండి రానా పెళ్లి పై హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరోలలో ఒకరైన రానా మ్యారేజ్ చేసుకొని బ్యాచిలర్ బ్యాచ్ లో నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ మ్యాన్ అంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మిహిక పేరు సోషల్ మీడియాలో వినిపించిన టైం నుండి ఆమె స్పెషల్ అట్రాక్షన్ గానే నిలుస్తూ వస్తుంది. అందుకే పెళ్లిలో కూడా ఎంతో అందంగా రానా పక్కన ముస్తాబై కనిపించింది మిహిక. ప్రస్తుతం నిర్మాత సురేష్ బాబు కొడుకు పెళ్లి చేసి సేదతీరుతున్నారు. త్వరలోనే ఇక సినిమాల ప్రాజెక్ట్స్.. ఓటిటి వెబ్ సిరీస్ ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తారని సమాచారం.