Begin typing your search above and press return to search.

నాని ‘దారే లేదా’ వీడియో సాంగ్: ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్..!

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:22 PM GMT
నాని ‘దారే లేదా’ వీడియో సాంగ్: ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్..!
X
నేచురల్‌ స్టార్‌ నాని డాక్టర్స్ - హెల్త్ వర్కర్స్ వంటి ఫ్రంట్‌ లైన్ వారియర్స్ కోసం 'దారే లేదా' అనే స్ఫూర్తి దాయకమైన మ్యూజిక్‌ వీడియోను రూపొందించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని సమర్పిస్తున్న ఈ సాంగ్ కోసం యంగ్‌ ప్రామిసింగ్‌ హీరో సత్యదేవ్‌ - రూప కడువయుర్‌ చేతులు కలిపారు. దీనికి ఛాయ్‌ బిస్కేట్‌ ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను నిర్వర్తించింది. కోవిడ్‌ బాధితుల ప్రాణాలు కాపాడటానికి తమతో పాటు కుటుంబ సభ్యుల జీవితాల్ని పణంగా పెట్టి సేవలు అందించిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కు అంకితమిస్తూ ఈ పాటను రూపొందించారు. తాజాగా 'దారే లేదా' పాటను నాని విడుదల చేశారు.

8 నిమిషాలకు పైగా ఉన్న 'దారే లేదా' సాంగ్ ద్వారా కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో వృత్తి రీత్యా సత్యదేవ్‌ - రూప‌ డాక్టర్స్ కావ‌డంతో ఉద‌యం షిప్ట్‌ లో కార్తిక్‌(స‌త్య‌దేవ్‌).. నైట్ షిఫ్ట్‌ లో శృతి(రూప‌) కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళ లైఫ్ లో స్పెషల్ డే లను కూడా వదులుకొని కరోనా బాధితులకు సేవలు చేస్తున్నట్లు చూపించారు. డాక్టర్స్ తమ‌ వృత్తి ధర్మం కోసం, ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో.. ఎంత రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చిందో అనేది ఈ పాటలో చాలా ఎమోషన‌ల్‌ గా తెలియజేసారు. ఇందులో పాండమిక్ సమయంలో డాక్టర్లపై జరిగిన దాడులను కూడా ప్రస్తావించారు. చివర్లో నాని కనిపించి కరోనా నుంచి తమను తాము కాపాడుకోడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు.

''మబ్బే కమ్మిందా.. లోకం ఆగిందా.. మాతో కాదంటూ.. చూస్తూ ఉండాలా.. దారే లేదా.. గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్దం చేస్తున్న శ‌త్రువు దూరంగా పోనే.. పోదా.." అంటూ సాగే ఈ పాట ఫ్రంట్‌ లైన్ వ‌ర్క‌ర్స్‌ కి ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. మేకింగ్ వ్యాల్యూస్ చాలా రిచ్‌ గా ఉన్నాయి. 'దారే లేదా' పాటకు విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూర్చారు. లిరిసిస్ట్ కె.కె(కృష్ణకాంత్) దీనికి స్పూర్తి దాయకమైన అందరూ ఆలోచిపజేసేలా సాహిత్యం అందించారు. రోషన్ సెబాస్టియన్ ఈ గీతాన్ని ఆలపించారు. సుమంత్ ప్రభాస్ ఈ సాంగ్ కు డైరెక్షన్ చేయగా.. మనోజ్ కాన్సెప్ట్ రచించారు. ఆదిత్య సినిమాటోగ్రఫీ అందించగా.. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ వర్క్ చేశారు. విజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ పాట వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.