ఆర్కెస్ట్రా కోసం సప్త సముద్రాలు దాటెళ్లారు సైలెంట్ గా!

Sun Sep 27 2020 18:00:57 GMT+0530 (IST)

Crossed the deep seas Budapest For Nishabdham Re Recording

అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్ధం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా.. కోన వెంకట్ నిర్మించారు. ట్రైలర్ ఇప్పటికే ఆడియెన్ ని ఆకట్టుకుంది.ఇందులో అనుష్క మూగ చెవిటి యువతిగా కనిపిస్తోంది. ఇక ఈ తరహా భాషను నేర్చుకునేందుకు ప్రత్యేకించి యూనివర్శల్ అప్పియరెన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుందిట. స్వీటీ నటనకు అవార్డ్ దక్కడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ థ్రిల్లర్ ఫార్మాట్ మూవీ కాబట్టి రీరికార్డింగ్ కి టీమ్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని తెలిసింది.

బిజిఎం అందిస్తున్న గోపాలకృష్ణన్ ఫిబ్రవరిలో బుడాపెస్ట్ ఆధారిత ఆర్కెస్ట్రాతో రికార్డింగ్ కార్యక్రమాలు చేయడం ఆసక్తికరం. బుడాపెస్ట్ గ్రాండ్ ఆర్కెస్ట్రా పూర్తిగా హాలీవుడ్ టచ్ ఉన్న పాశ్చాత్య ఆర్కెస్ట్రా తరహా. గిరీష్ ఉత్తమ ఫలితం కోసం అక్కడ వరకూ వెళ్లారట. హాలీవుడ్ రేంజులో చక్కటి నాణ్యత ఉన్న రీ-రికార్డింగ్ కోసమే ఈ రిస్క్ అని తెలిసింది. హంగరీ క్యాపిటల్ గా ఉన్న బుడాపెస్ట్ ఎంతో సుందరమైన నగరం. అక్కడికి విమానంలో వెళ్లాలంటే 16 గంటల ప్రయాణం. అందమైన పొడవైన బ్రిడ్జీలు.. చారిత్రాత్మకమైన ఆర్కిటెక్చర్ ఉన్న పార్లమెంట్ తో నగరం ఎంతో విజువల్ వండర్ గా కనిపిస్తుంది.

ఇక గోపి సుందర్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ లను అందించారు. పీపుల్స్ మీడియాతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రచారం పరంగా వెనకబడిన టీమ్ నేటి సాయంత్రం బిగ్ బాస్ 4 ఎపిసోడ్ లో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది. నాగార్జున- అనుష్క ఒకే వేదికపై ట్రీటివ్వబోతున్నారన్నది ఆసక్తిని పెంచుతోంది.