Begin typing your search above and press return to search.

రియల్ హీరోతో క్రియేటివ్ డైరెక్టర్ మూవీ.. లేనట్టేనా??

By:  Tupaki Desk   |   4 Jun 2021 11:30 PM GMT
రియల్ హీరోతో క్రియేటివ్ డైరెక్టర్ మూవీ.. లేనట్టేనా??
X
గతేడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో బాధిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారిని కట్టడి చేయడానికి మొదటినుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. కానీ ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలసంఖ్యలో మరణాలు జరుగుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో దేశప్రజలు దిక్కుతోచని స్థితిలో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కానీ ఎంతమంది ఎన్ని సేవలు చేసినా ఎన్ని సహాయ చర్యలు తీసుకున్నా స్టార్ యాక్టర్ సోనూసూద్ చేసిన సేవలు మాత్రం ఎవరు చేయలేరు. సినిమాల్లో విలన్ గా నటించే సోను నిజజీవితంలో నిజమైన హీరో అనిపించుకున్నాడు.

ప్రజల దృష్టిలో అతనొక గొప్ప మానవతావాదిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ.. అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో దేశం మొత్తం సోనూసూద్ ను కొనియాడుతూనే ఉంది. కానీ ఇప్పటికి సోను సేవలు చేయడంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా సాయం చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో వేదికగా హెల్ప్ అడిగిన వారికీ స్పందిస్తూనే ఉన్నాడు. అసలు విషయం ఏంటంటే.. సోనూసూద్ కరోనా బారినపడి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి బాధితులకు సహాయం అందించాడు.

అయితే కొంతకాలంగా సోనూసూద్ ప్రధానపాత్రలో సినిమాలు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో సోను హీరోగా కూడా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయట. తాజాగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ సోను కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసాడని టాక్ నడుస్తుంది. అంతేగాక త్వరలోనే వీరి కాంబినేషన్ పై క్లారిటీ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా అవన్నీ పుకార్లు అని తేల్చేశారు సోనూసూద్ సన్నిహితులు. అసలు ఇంతవరకు ఆ డైరెక్టర్ కు సోనుకు సంప్రదింపులు జరగలేదని.. అయినా సోను ప్రస్తుతం కొత్త సినిమాలు ఒప్పుకునే ఆలోచనలో లేడని తెలిపారట. ఎందుకంటే ప్రస్తుతం సోను చేతినిండా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయట. మరి ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. మరి ఈ పుకార్లు ఎలా వచ్చాయంటూ ఇండస్ట్రీలో ఆశ్చర్యపోతున్నారని టాక్.