'రాధే శ్యామ్' సినిమాపై క్రేజీ అప్డేట్..!

Fri Jun 18 2021 17:00:01 GMT+0530 (IST)

Crazy update on Radhe Shyam movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో 'రాధే శ్యామ్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న డార్లింగ్.. ఇందులో అందమైన ప్రేమకథను చూపించబోతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.'రాధే శ్యామ్' సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని.. ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని అందరూ చెబుతూ వస్తున్నారు. 1960స్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతోందని ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తే అర్థం అయింది. అయితే ఈ చిత్రంలో ప్రేమ కథతో పాటుగా అందరినీ ఆశ్చర్యపరిచే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. లవ్ డ్రామా అనేది ప్రధాన ఇతివృత్తంగా ఉన్నప్పటికీ.. థ్రిల్ కలిగించే కోణం ఉందని చెబుతున్న వార్తలు ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

ఇకపోతే 'రాధే శ్యామ్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్స్ తో గ్రాండియర్ గా కనిపించబోతోందని తెలుస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ - ప్రమోద్ - ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ విడుదల చేయనున్నారు.