Begin typing your search above and press return to search.

'నారప్ప' రిలీజ్ పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 8:31 AM GMT
నారప్ప రిలీజ్ పై క్రేజీ అప్డేట్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలతో స్టార్ అయ్యారు హీరో విక్టరీ వెంకటేష్.. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. అందుకే ప్రస్తుతం నారప్ప అనే వైవిధ్యమైన రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ కెరీర్ లో నారప్ప 74వ సినిమాగా తెరకెక్కింది. కోలీవుడ్ ‘అసురన్’ సినిమాకు నారప్ప ఆఫీసియల్ రీమేక్ రూపొందుతుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం సినిమాలు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి

ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ చేయబోతుంది హీరోయిన్ ప్రియమణి. ఇదివరకే విడుదలైన ‘నారప్ప’ పోస్టర్స్‌ - గ్లింప్స్ లో వెంకటేష్ - ప్రియమణి కాంబినేషన్ అదిరిపోయింది. ఊర మాస్ గెటప్‌లో వెంకటేష్ పూర్తి డిఫరెంట్ గా కనిపించి సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం వెంకీమామ మాములు స్పీడ్ లో లేడు. సినిమాలు వేగంగా పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదలకు వరుసలో పెట్టేసాడు. అయితే ప్రస్తుతం నారప్పకు సంబంధించి వెంకీ చాలా కెరీర్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా అనంతపురం నేపథ్యంలో తెరకెక్కించారు.

అందుకే అక్కడి భాషా యాస అన్ని పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారట మేకర్స్. తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నారప్పకు సంబంధించి న్యూ అప్డేట్ అందించినట్లు తెలుస్తుంది. మరో వారం రోజుల్లో నారప్ప ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అలాగే త్వరలోనే నారప్ప రిలీజ్ గురించి క్లారిటీ ఇవ్వనున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. మరి ఈ సినిమా ఒరిజినల్ లో యాక్ట్ చేసిన ధనుష్ ఇటీవలే నేషనల్ అవార్డు అందుకున్నాడు. అందుకే ప్రస్తుతం నారప్ప సినిమా పై ప్రేక్షకులు ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను సురేష్ బాబు - కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా వెంకీ ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు దృశ్యం సీక్వెల్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.