'మహేష్ - త్రివిక్రమ్' మూవీకి క్రేజీ టైటిల్..!

Tue May 04 2021 12:03:25 GMT+0530 (IST)

Crazy title for Mahesh Trivikram movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇదివరకు అతడు ఖలేజా సినిమాలు రూపొందాయి. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేకపోయాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ అరవిందసమేత - అలవైకుంఠపురంలో సినిమాలతో.. అటు మహేష్ బాబు వరుసగా సూపర్ హిట్స్ తో ఉన్నాడు. ఇద్దరూ కూడా సూపర్ సక్సెస్ లో ఉండేసరికి వీరి కాంబినేషన్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే త్రివిక్రమ్ - మహేష్ కాంబో వెండితెర పై హిట్ కాకపోయినా బుల్లితెర పై మాత్రం సూపర్ సక్సెస్ అందుకుందని చెప్పాలి. ఎందుకంటే అతడు - ఖలేజా సినిమాలు టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా వీరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రకటించే సరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దాదాపు ఖలేజా సినిమా వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్ మూవీ టైటిల్ ఇదే అంటూ పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. ఈసారి మహేష్ - త్రివిక్రమ్ సినిమాకు 'పార్థు' అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే ఈ టైటిల్ వెనకకూడా ఓ రీసన్ వినబడుతుంది. నిజానికి పార్థు అనేది వీరి ఫస్ట్ కాంబినేషన్ మూవీ అతడులో మహేష్ క్యారెక్టర్ పేరు. మరి ఇప్పుడు అదే పేరుతో సినిమా రాబోతుందా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా పార్థు అనే పేరునే మేకర్స్ ఫిక్స్ చేసారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి అసలు విషయం తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.