'సర్కారు వారి పాట'పై క్రేజీ టాక్.. నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

Wed Mar 09 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Crazy talk on 'Sarkaru Vari Pata' Really a fan festival!

ఎప్పుడైతే 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్‌గా ఎదిగాడో.. అప్పటి నుంచీ టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఇలా ప్రతి ఒక్కరూ దేశ వ్యాప్తంగా సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా వెనక పడటంతో.. ఆయన ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు.అయితే ఇలాంటి తరుణంలో ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రను పోషిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని వై. రవిశంకర్ రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుక మే 12న రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ తమిళ భాషలలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారని టాక్ నడుస్తోంది. మరి ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు. కాగా సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈ మూవీ చేయనున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది పూర్తైన అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కించనున్నాడు.