Begin typing your search above and press return to search.

క్రేజీ హీరోయిన్ ఫైన‌ల్ వ‌ర్క్ కంప్లీట్‌!

By:  Tupaki Desk   |   30 Jun 2022 11:37 AM GMT
క్రేజీ హీరోయిన్ ఫైన‌ల్ వ‌ర్క్ కంప్లీట్‌!
X
యువ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. ప‌ర్ ఫెక్ట్ క‌థ‌ల‌ని ఎంచుకుంటూ త‌న కెరీర్ ని ప‌క్క‌గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయ‌న న‌టించిన సినిమా విడుద‌లై దాదాపు ఏడాదిన్న‌ర కావ‌స్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. అంతులో 'కార్తికేయ‌2' ఒక‌టి. ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. నిఖిల్ 'అర్జున్ సుర‌వ‌రం' త‌రువాత చేస్తున్న మూవీ ఇది. దాదాపు ఏడాదిన్న‌ర విరామం త‌రువాత సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ 2'తో హీరో నిఖిల్ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు.

2014లో వ‌చ్చిన 'కార్తికేయ‌' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందూ మొండేటి రూపొందించారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ న‌టించారు. దాదాపు 6 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన 'కార్తికేయ‌' భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా నిఖిల్ కు మంచి విజ‌యాన్ని అందించింది.

అలాంటి మూవీకి సీక్వెల్ గా వ‌స్తున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ని ప్రారంభించేశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌ని విడుద‌ల చేశారు. తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లోని విజువ‌ల్స్ సినిమా ఓ వండ‌ర్ గా నిల‌వ‌బోతోంద‌నే సంకేతాల్ని అందించింది. రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన డ‌బ్బింగ్ వ‌ర్క్ ని హీరో హీరోయిన్ లు పూర్తి చేయ‌డం మొద‌లు పెట్టారు.

హీరో నిఖిల్ హిందీ వెర్ష‌న్ కు సంబంధించిన డ‌బ్బింగ్ ని తాజాగా పూర్తి చేశారు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. కాగా హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ళ‌యాల వెర్షన్ కు సంబంధించిన డ‌బ్బింగ్ ఫైన‌ల్ వ‌ర్క్ ని పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని జూలై 22న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు.