క్రేజీ అంకుల్స్ ని ఆడిస్తున్న హాట్ యాంకర్

Sun Jul 25 2021 16:08:33 GMT+0530 (IST)

Crazy Uncles Title Song Lyrical video

నేటితరం యాంకర్లలో బుల్లితెర -పెద్ద తెరలను ఏల్తున్న భామగా శ్రీముఖి సుపరిచితం. ఈ తెలుగు బ్యూటీ క్షణం తీరిక లేనంత బిజీగా కెరీర్ ని సాగిస్తున్నారు. యాంకరింగ్ లో దశాబ్ధ కాలంగా శ్రీముఖి హవాకు ఎదురే లేకుండా కొనసాగుతోంది. ఇంతకుముందు బిగ్ బాస్ - తెలుగు ఇంటి సభ్యురాలిగా కొనసాగిన శ్రీముఖి రన్నర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో నటిగా అవకాశాలు అందుకుంటున్నారు.తాజాగా సత్తిబాబు దర్శకత్వంలో `క్రేజీ అంకుల్స్` అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది శ్రీముఖి. ఈ సినిమా తన కెరీర్ కి బ్రేకింగ్ పాయింట్ అవుతుందనే హోప్ తో ఉందీ బ్యూటీ. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అంకుల్స్ టైటిల్ సాంగ్ ని దర్శకుడు అనీల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ లిరికల్ వీడియోలో అంకుల్స్ తో శ్రీముఖి ఎనర్జిటిక్ డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి.

అంకుల్స్ మనో- రాజా రవీంద్ర స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్- బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది.

నితిన్ తోనూ ఆఫర్:

ఈ సినిమాతో పాటు శ్రీముఖి పలు చిత్రాలకు సంతకాలు చేశారు. నితిన్ తదుపరి చిత్రంలోనూ అవకాశం అందుకున్నారు. జులాయి-నేను శైలజ-జెంటిల్ మెన్ -బాబు బాగా బిజీ లాంటి తెలుగు చిత్రాల్లో శ్రీముఖి సహాయ నటిగా కనిపించారు. అదుర్స్ - అదుర్స్ 2 -మనీ మనీ-సూపర్ మామ్-సూపర్ సింగర్-జోలకటక-కామెడీ నైట్స్-బొమ్మ అదిరింది సహా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో బుల్లితెర వీక్షకులకు శ్రీముఖి సుపరిచితం. యాంకర్ రవితో పటాస్ పెద్ద సక్సెస్. ఇక ఇతర యాంకర్ల తరహాలోనే టీవీ కెరీర్ లో కొన్ని వివాదాలతోనూ శ్రీముఖి పేరు ముడిపడింది. సోషల్ మీడియాల్లోనూ శ్రీముఖి హవా కొనసాగుతోంది. ఇన్ స్టా వేదికగా నిరంతరం హాటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు