ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Sun Sep 20 2020 10:30:19 GMT+0530 (IST)

Court notices to the famous actor ..

ప్రముఖులకు కోర్టుకు సంబంధించిన తిప్పలు తరచూ ఎదురవుతుంటాయి. కదలించుకొని మరీ నోటీసులు తెప్పించుకునే వారు కొందరైతే.. ఏ మాత్రం అవగాహన లేని రీతిలో ఎవరి నిర్ణయాలతోనో ఇరుక్కుపోవటం ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కోలీవుడ్ ప్రముఖ నటుడు తెలుగు వారికి సుపరిచితుడైన ఆర్య.ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయకుండానే ఆయన కోర్టు నోటీసుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. తాజాగా ఆయనకు తమిళనాడులోని అంబా సముద్రం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల కాలంలో ఆర్య ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు కదా? అన్న అనుమానం రాక మానదు. నిజమే.. మీ సందేహంలో అర్థం ఉంది. కానీ.. ఊహించని విధంగా తొమ్మిదేళ్ల క్రితం ఆయన నటించిన సినిమా.. ఇప్పుడాయనకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది.

తొమ్మిదేళ్ల క్రితం ఆర్య అవన్ ఇవన్ అనే సినిమాలోనటించాడు. బాల దర్శకత్వంలో విశాల్.. ఆర్య ఇద్దరు నటించిన ఈ సినిమాలో సింగంపట్టి జామీన్ ను అవమానించేలా సన్నివేశాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపనలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వారు  అప్పట్లో కోర్టు ఆశ్రయించగా.. తాజాగా ఈ వ్యవహారం విచారణకు వచ్చింది. దీంతో.. ఆర్య కోర్టుకు హాజరు కావాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది. తొమ్మిదేళ్ల క్రితం నటించిన సినిమాలోని సన్నివేశాలకు.. ఇప్పుడు కోర్టు కేసుల్ని ఎదుర్కోవటమా? అన్నదిప్పుడు షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు.