Begin typing your search above and press return to search.

152లో చూసుకుందామ‌న్నారా?

By:  Tupaki Desk   |   21 Nov 2019 1:30 AM GMT
152లో చూసుకుందామ‌న్నారా?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మించిన సైరా న‌ర‌సింహారెడ్డి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కింది ఈ చిత్రం. బాహుబ‌లి స్థాయి వ‌సూళ్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. ఆ ద‌రిదాపుల్లో ఎక్క‌డా లేదు రిజ‌ల్ట్. సినిమా ఫుల్ ర‌న్ లో 300 కోట్ల లోపే తెచ్చింద‌ని ఓ అంచ‌నా. ఆ లెక్క‌ల‌ను నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్ల‌డించింది లేదు. ప్రీ రిలీజ్- శాటిలైట్- డిజిట‌ల్ రైట్స్ రూపం లో నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నా.. పంపిణీదారుల ప‌రిస్థితి ఏమిటి? అంటే 20 శాతం న‌ష్టాల్ని మిగిల్చింద‌న్న చ‌ర్చా సాగుతోంది.

దాదాపు ప‌త్రీ ఏరియాలో 20 శాతం న‌ష్టం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. హిందీ- అమెరికా మార్కెట్ మొద‌టి నుంచి డ‌ల్ గానే ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ న‌ష్టం మ‌రింత ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ న‌ష్టాల‌ను చిరు ఎలా భ‌ర్తీ చేస్తారు? ఆయ‌న ద‌గ్గ‌రున్న ప్ర‌త్యామ్నాయ మార్గం ఏది? అంటే పంపిణీ వ‌ర్గాల్ని ఆదుకునే ప్ర‌త్నామ్నాయంగా 152వ సినిమాని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు 152వ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూట్ కి వెళ్ల‌నున్నారు. అయితే సైరాతో న‌ష్ట‌పోయిన పంపిణీదారుల‌ను ఈ సినిమానే ఆదుకుంటుంద‌ని స‌మాచారం.

సైరా పంపిణీ చేసిన పంపిణీదారుల‌కే 152వ సినిమా పంపిణీ హ‌క్కుల్ని ఇచ్చే అవ‌కాశం క‌ల్పించే విధంగా మెగాస్టార్ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిసింది. అంటే ఆ న‌ష్టాల్ని 152 క‌వ‌ర్ చేయాల‌న్న మాట‌. దానికి త‌గ్గ‌ట్టే చిరు ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు కూడా త‌గ్గిస్తున్నట్లు స‌మాచారం. ఖ‌ర్చు త‌గ్గించి సేఫ్ సినిమాని బ‌య్య‌ర్ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌. సాధార‌ణంగా ఒక సినిమా న‌ష్ట‌పోతే త‌ర్వాతి సినిమా ద్వారా ఆ న‌ష్టాలు భ‌ర్తీ ప్ర‌క్రియ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. చిరు ఇప్పుడు కూడా సాయ‌ప‌డాల‌నే మంచి ఉద్ధేశంతో ఆ ప‌ద్ద‌తినే అనుస‌రిస్తున్నారు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ బ‌యోపిక్ తొలి భాగం పంపిణీ వ‌ర్గాల‌కు భారీగా న‌ష్టాలు తేవ‌డంతో రెండ‌వ భాగం హ‌క్కుల్ని ఉచింగానే క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే.