కరోనా తగ్గింది సరే థియేటర్లకు మోక్షం కల్పిస్తారా?

Thu Jun 17 2021 15:03:54 GMT+0530 (IST)

Corona second wave effect on Tollywood?

ఏడాది కాలంగా సినిమా రంగం కరోనా మహమ్మారీ కారణంగా కుదేలైన సంగతి తెలిసిందే. ఊహించని అతిథిలా వచ్చి వైరస్ వేధిస్తోంది. కరోనా దెబ్బకు ముఖ్యంగా ఎగ్జిబిషన్ రంగం పూర్తి క్రైసిస్ లోకి వెళ్లిపోయింది. ఈ రంగంలో వేలాదిగా కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే తిరిగి ఎగ్జిబిషన్ రంగాన్ని పునరుద్ధరించేందుకు తెలుగు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టనున్నాయి? థియేటర్లు కోలుకోవాలంటే  తిరిగి తెరవాలంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అవసరం? అన్ని చర్చనీయాంశమైంది.ప్రస్తుతం దీనిపై సినీపెద్దల్లో చర్చ సాగుతోంది. నిర్మాతల గిల్డ్ సహా అగ్ర హీరోలు దీనిపై దృష్టి సారిస్తున్నారని తెలిసింది. ఇంతకుముందు ఏపీలో థియేటర్లకు క్రైసిస్ కాలానికి కరెంటు బిల్లులు మాఫీ చేశారు. థియేటర్లను 50శాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవచ్చని అనుమతులిచ్చారు. అలాగే నిర్మాతలకు షూటింగుల కోసం.. రకరకాల వెసులుబాట్లు కల్పించారు. ఎగ్జిబిటర్లకు బ్యాంకు వడ్డీలపై మాఫీలు అమలు చేశారు. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోందో వేచి చూడాలి.

అటు ఏపీలో ఎగ్జిబిటర్ల సమావేశాలు.. ఇటు తెలంగాణలో ఎగ్జిబిటర్ల సమావేశాలు ఇకపై వేడెక్కించనున్నాయి. ప్రభుత్వాల్ని కలిసి సాయం కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎగ్జిబిషన్ రంగానికి ఎలాంటి సాయాలు ఉంటాయో వేచి చూడాలి.

ఇక ఏపీలో అపరిష్కృతంగా ఉన్న టిక్కెట్టు రేటు తగ్గింపు అంశం మరోసారి చర్చనీయాంశం కానుంది. పెద్ద సినిమాలు రిలీజ్ కావాలంటే టిక్కెట్టు ధరలు పెంచుకునే వెసులుబాటు కావాలి. మరి జగన్ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా?  విడుదల  చేసిన జీవోని సవరిస్తుందా? అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా ఉంది. మునుముందు మెగాస్టార్ నటించిన ఆచార్య.. బన్ని నటించిన పుష్ప యష్ కేజీఎఫ్ .. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సహా పలు భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. వీటన్నిటికీ టిక్కెట్టు పెంపు వర్తించకపోతే వకీల్ సాబ్ తరహాలోనే నష్టాలు ఎదుర్కోక తప్పదని  ఆందోళన చెందుతున్నారు.