స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా.. కంగారులో ఫ్యాన్స్!

Fri May 07 2021 15:19:38 GMT+0530 (IST)

Corona for the entire star heroine family

బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో స్టార్ యాక్ట్రెస్ శిల్పాశెట్టి షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. తన కుటుంబంలో తనకు తప్ప మిగిలిన వారంతా కరోనా బారినపడ్డారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో నటి ఆందోళనగా ఉన్నట్లు అర్ధమవుతుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో శిల్పా స్వయంగా ఈ విషయాన్నీ ఓ నోట్ రూపంలో పోస్ట్ చేసింది.ఆమె సోషల్ మీడియాలో శిల్పా ఈ విధంగా పోస్ట్ చేసింది. "గత 10 రోజులుగా మా కుటుంబం అవస్థలు పడుతోంది. మా ఫ్యామిలీలో ఫస్ట్ మా అత్తగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పిల్లలు సమిషా - వియాన్ - మా అమ్మగారు.. ఇలా అందరితో పాటు నా భర్తకూడా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఎవరి రూమ్ లో వారున్నారు. అలాగే మా ఇంట్లో పనిచేసే ఇద్దరికీ కూడా కోవిడ్ సోకింది. ప్రస్తుతం వారు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అందరూ కూడా వైద్యులు అధికారులు సూచించిన విధంగా చికిత్స పొందుతున్నారు.

కానీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. అందరూ రికవరీ అవుతున్నారు. మా ఫ్యామిలీలో నాకు మాత్రమే కోవిడ్ నెగటివ్ వచ్చింది." అలాగే మా ఫ్యామిలీ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు ధన్యవాదాలు. మా ఫ్యామిలీకి వైద్యసహాయం అందించిన వైద్యులకు - త్వరగా స్పందించిన బిఎంసి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. చివరిగా అందరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి. కోవిడ్ పాజిటివ్ కాదు.. మానసికంగా పాజిటివ్ ఉండండి.. అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పింది శిల్పాశెట్టి. ఇదిలా ఉండగా.. మొన్నటివరకు సూపర్ డాన్సర్ 4 లో జడ్జిగా ఉన్నటువంటి శిల్పా.. ఇటీవలే ప్రోగ్రాం సెట్ డామన్ కు మార్చినందుకు షో నుండి వైదొలిగినట్లు సమాచారం.