మరో సింగర్ కు కరోనా పాజిటివ్

Wed Apr 01 2020 17:20:28 GMT+0530 (IST)

Corona Positive For Another Singer

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. తన తమ బేధాలు లేకుండా అందరికీ సోకుతోంది. దేశ ప్రధానుల నుంచి సినీ సెలెబ్రెటీలు సామాన్యుల వరకూ అందరికీ కాటు వేస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు సింగర్ లు కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా అమెరికా కంట్రీ సింగర్ కేలీ షోర్ (25)కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడుతున్నారు.కేలీ షోర్ ట్వీట్ చేస్తూ.. 'తాను క్వారంటైన్ లో ఉన్నానని.. తనకు కరోనా మహమ్మారి సోకిందని' పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కరోనా కారణంగా మూడు వారాలుగా ఇంటికి పరిమితమయ్యానని.. కేవలం నిత్యావసరాల కోసం బయటకు వెళ్లానని.. అయినా తనకు కరోనా సోకిందని కేలీ షోర్ షాకింగ్ విషయం బయటపెట్టింది.

తనకు ఒళ్లు నొప్పులు జ్వరం రుచి మొగ్గలు ముక్కు పనిచేయడం లేదని వాపోయింది. దీన్ని బట్టి కరోనా ఎంత డేంజరో అర్థం చేసుకోవాలని కోరింది. విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కేలీ ట్వీట్ లో హెచ్చరించింది.

ఇప్పటికే కరోనా తో గ్రామీ అవార్డు విజేత సింగర్ అయిన జోయ్ డిఫ్సీ మృతిచెందారు. ఇప్పుడు మరో సింగ్ సైతం కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది.