Begin typing your search above and press return to search.

పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ గండం??

By:  Tupaki Desk   |   5 May 2020 8:30 AM GMT
పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ గండం??
X
సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు.. మీడియం రేంజ్ సినిమాలకు సెట్స్ పై ఉండగానే బిజినెస్ పూర్తవుతుంది. కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు అనౌన్స్మెంట్ వచ్చిన రోజునే ఎడ్వాన్సులు ఇస్తుంటారు. ఇక మిగతా వాటికి.. కొన్ని మీడియం రేంజ్ ప్రాజెక్టులకు సినిమా రిలీజుకు నెల రోజుల ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతాయి. అయితే ఇప్పుడు కరోనా క్రైసిస్ కారణంగా ఈ విషయంలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.

ఇప్పుడు స్టార్ట్ కానున్న పెద్ద సినిమాలపై ఈ ఎఫెక్ట్ దారుణంగా ఉండబోతోందని అంటున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న మహేష్ బాబు - పరశురామ్ సినిమాకు అడ్వాన్సులు ఆశించినంత రేంజ్ లో రావడంలేదని ట్రేడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. దీనికి ఒక కారణం కరోనా క్రైసిస్ అయితే మరో కారణం 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతకు 9 కోట్లు నష్టం రావడమేనని తెలుస్తోంది.

మహేష్ సినిమాకే కాదు.. అల్లు అర్జున్ సినిమాకూ ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. సగానికి పైగా వచ్చిన అడ్వాన్స్.. దాంతో పాటు ఎక్కువ వడ్డీకి ఫైనాన్స్ తీసుకొచ్చి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయవలసి ఉంటుందని అంటున్నారు. బడా స్టార్ హీరోలు నటించే క్రేజీ ప్రాజెక్టుల విషయమే ఇలా ఉంటే క్రేజ్ తక్కువగా ఉండే..పెద్దగా డిమాండ్ లేని హీరోల సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అంచనా వేయవచ్చు.

అడ్వాన్సులు మాత్రమే కాదు.. ఆల్రెడీ ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టిన కొన్ని ఇతర సినిమాల విషయం లో కూడా ఈ మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ఈ కరోనా క్రైసిస్ కారణంగా ఫైనాన్స్ విషయంలో ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. థియేటర్లు రీ-ఓపెన్ అయ్యి.. సాధారణ స్థితికి వచ్చేవరకూ ఫైనాన్స్ వ్యవహారాలు ఇలాగే కొనసాగుతాయని అంటున్నారు.