Begin typing your search above and press return to search.

పెద్ద సినిమాలు అప్పటిదాకా ఆగాల్సిందేనా?

By:  Tupaki Desk   |   2 May 2020 5:45 AM GMT
పెద్ద సినిమాలు అప్పటిదాకా ఆగాల్సిందేనా?
X
కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ అన్నింటికంటే ఎక్కువ ప్రభావం పడింది సినిమా రంగం మీదనే.. మొత్తం సినిమా పరిశ్రమ విపత్కర పరిస్థితుల్లో ఉంది. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ నుంచి థియేటర్స్ వరకు స్తబ్ధత నెలకొంది. మళ్లీ సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు సినీ పరిశ్రమ గాడిన పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

లాక్ డౌన్ తో అన్ని పరిశ్రమలలాగే సినీ పరిశ్రమ కూడా పూర్తిగా మూతపడింది. సినీ కార్మికులను స్టార్ హీరోలంతా తలో ఒక చేయి వేసి ఆదుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత పి. రామ్మోహన్ సినీ పరిశ్రమ మనుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ మళ్లీ మాములు స్థితికి రావడానికి ఎక్కువ టైం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే సమ్మర్ సీజనే కాదు.. ఈ సంవత్సరం కూడా మిస్ అయినట్లేనని కుండబద్దలు కొట్టారు.

సినిమా అంటేనే జనాలకు పిచ్చి.. ఓ పెద్ద సినిమా వస్తుందంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో థియేటర్స్ కు వస్తారు. అంతమంది రావాలంటే మొదట కరోనా లాంటి భయాలు పోవాలి. మాల్స్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్ మాదిరిగానే సినిమా థియేటర్స్ కూడా రికవరీ కావాలంటే టైం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమయంలో పెద్ద సినిమాలు రావడం తప్పు అని.. ఆదాయం తెచ్చే ఆ సినిమాలు ఇప్పుడు ఆగాల్సిందేనని నిర్మాత పి. రామ్మోహన్ స్పష్టం చేశారు. నిర్మాతలు కూడా ఈ సమయంలో సినిమాలను రిలీజ్ చేయొద్దని సూచించారు. ప్రేక్షకులు నిర్భయంగా వచ్చే వరకూ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.