Begin typing your search above and press return to search.

క్లాప్ పడాలంటే ఈ కండిషన్స్ తప్పనిసరి!

By:  Tupaki Desk   |   26 May 2020 6:10 AM GMT
క్లాప్ పడాలంటే ఈ కండిషన్స్ తప్పనిసరి!
X
గత రెండు నెలలుగా షూటింగ్స్‌ పూర్తిగా ఆగిపోయాయి. ఈ విపత్తు సమయంలో షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినీ కార్మికుల కోసం అయిన షూటింగ్స్‌ ను మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్లుగానే దేశ వ్యాప్తంగా సినిమాల షూటింగ్స్‌ కు రెడీ అవుతున్నారు. సినిమా షూటింగ్స్‌ కు వెళ్లాలి అంటే ఖచ్చితంగా కొన్ని గైడ్‌ లైన్స్‌ పాటించాల్సిందే అంటూ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా సూచించింది. అందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

షూటింగ్‌ లో తప్పనిసరిగా శానిటైజర్స్‌ ఉపయోగించాల్సిందే. ప్రతి రోజు సెట్స్‌ ను పూర్తిగా శానిటైజేషన్‌ చేయాల్సిందే. యూనిట్‌ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మూడు అంచెల విధానంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షూట్‌ లో పాల్గొనే వాళ్లు మినహా ప్రతి ఒక్కరు మాస్క్‌ లు ధరించాలి. నటీ నటులు కూడా షూట్‌ లేని సమయంలో ఖచ్చితంగా మాస్క్‌ లను ధరించాల్సిందే. మాస్క్‌ ధరించకుండా ఎవరు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి రోజు షూటింగ్‌ ప్రారంభించడానికి ముందు కాస్ట్‌ అండ్‌ క్రూకు ధర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయాలి. సెట్స్‌ ను కూడా రోజు రోజు కూడా శానిటైజర్స్‌ తో క్లీన్‌ చేయాలి. ఈ శానిటైజేషన్‌ పక్రియ కూడా ప్రభుత్వం గుర్తించిన సంస్థలు మాత్రమే నిర్వహించాలంటూ నిర్మాతల గిల్డ్‌ ఆదేశించింది.

షూటింగ్‌ లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తమ ఆరోగ్యం విషయంలో డిక్లరేషన్‌ సమర్పించాల్సిందే. పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లుగా నిరూపించుకోవడంతో పాటు కరోనా పాజిటివ్‌ పేషంట్స్‌ తో కాంటాక్ట్‌ లేకుండా ఉండాలి. షూటింగ్‌ అంతా పూర్తి అయిన తర్వాత యూనిట్‌ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా విధిగా యూనిట్‌ సభ్యులందరి వివరాలను నమోదు చేసుకోవాల్సిందే.

థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి మోతాధుకు మించి ఉష్ణోగ్రతలు ఉన్న వారిని సెట్స్‌లోకి అనుమతించకూడదు. కొత్త నటీనటులను అస్సలు సెట్స్‌ లోకి అనుమతించకూడదు. పూర్తి వివరాలు ఉన్న వారిని మాత్రమే సెట్స్‌ లోకి అనుమతించి వారి ట్రాక్‌ రికార్డును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల పాటు ప్రతి షూటింగ్‌ సెట్స్‌ లో జూనియర్‌ డాక్టర్‌ మరియు క్వాలిఫైడ్‌ నర్స్‌ ను తప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెట్స్‌ లో తప్పకుండా ఆంబులెన్స్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మూడు నెలల పాటు 60 యేళ్లు దాటిన వారిని సెట్స్‌ లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప 60 యేళ్లు దాటిన వారు సెట్స్‌ కు రాకూడదు. మేకప్‌ మన్‌ మరియు హెయిర్‌ డ్రస్సర్స్‌ పీపీఈ కిట్స్‌ ను ధరించాల్సిందే. ఆర్ట్‌డిపార్ట్‌ మెంట్‌ తో పాటు ప్రతి చోట కూడా ఖచ్చితంగా సంఖ్య తగ్గించుకోవాలి.