కామ్రేడ్ ఆంథెమ్ టీజర్ అదిరిందిగా!

Wed Jul 17 2019 23:09:41 GMT+0530 (IST)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ త్వరలో 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  టీజర్.. ట్రైలర్లు.. లిరికల్ సాంగ్స్ సినిమాపై ఇప్పటికే ఆసక్తిని పెంచాయి.  తాజాగా ఈ సినిమానుండి కామ్రేడ్ ఆంథెమ్ టీజర్ ను విడుదల చేశారు.ఈ కామ్రేడ్ ఆంథెమ్ పాటను జూలై 18 వ తేదీ గురువారం ఉదయం 11:11 గం. లకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు.  ఈ కామ్రేడ్ ఆంథెమ్ ప్రత్యేకత ఏంటంటే తెలుగులో విజయ్ దేవరకొండ పాడడం జరిగింది.  తమిళంలో విజయ్ సేతుపతి.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఆలపించారు.  ఇలా మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్టార్లు ఇలా కామ్రేడ్ ఆంథెమ్ లో భాగం కావడం అందరినీ ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సౌత్ మార్కెట్ అంతా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి..  దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ హీరోలు ఇలా కామ్రేడ్ కోసం గొంతు సవరించుకోవడం విజయ్ అభిమానులకు ఫుల్ జోష్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తునారు.  'డియర్ కామ్రేడ్' జులై 26 న విడుదల అవుతోంది.