Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కోసం యంగ్‌ బ్యూటీస్ మ‌ధ్య పోటీ!

By:  Tupaki Desk   |   25 Jun 2022 12:30 AM GMT
స్టార్ హీరో కోసం యంగ్‌ బ్యూటీస్ మ‌ధ్య పోటీ!
X
స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'RRR'. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి న‌టించిన ఈ మూవీ ఇది. గ‌త కొంత కాలంగా క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

వెండితెర‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 1150 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ఓట‌టీలోనూ దుమ్ము దులిపేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ హిందీ వెర్ష‌న్ స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఈ మూవీని చూస్తున్న హాలీవుడ్ సెల‌బ్రిటీలు 'RRR' టీమ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సినిమాకు భారీ స్థాయిలో ప్ర‌చారాన్ని క‌ల్పిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఈ మూవీ డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేసిన మేక‌ర్స్ సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోందో హిట్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో వున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి హీరోయిన్ ల కొర‌త ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.

ఈ మూవీ ప్ర‌క‌టించిన త‌రువాత ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అలియా వివాహం చేసుకోవ‌డం.. ఇత‌ర ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుండ‌టంతో త‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. ఆ త‌రువాత ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ లు జాన్వీ క‌పూర్‌, శ్ర‌ద్దా క‌పూర్‌, కృతి స‌న‌న్, దిషా ప‌టాని ల పేర్లు వినిపించాయి. ఇదిలా వుంటే తాజాగా మ‌రో ఇద్ద‌రు క‌న్న‌డ బ్యూటీస్ పేర్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

'ఉప్పెన‌' మూవీతో క్రేజ్ ని సొంతం చేసుకున్న కృతిశెట్టి తో పాటు 'పెళ్లిసంద‌D' బ్యూటీ శ్రీ‌లీల పేర్తు వినిపిస్తున్నాయ‌ట‌. ఈ ఇద్ద‌రు హీరోయిన్ లు తెలుగులో వ‌రుస ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీగా వున్నారు. కృతిశెట్టి.. 'ది వారియ‌ర్‌'.. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. తాజాగా నాగ‌చైత‌న్య - వెంక‌ట్ ప్ర‌భు మూవీలో చేస్తోంది.

ఇక శ్రీ‌లీల కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో బిజీగానే వుంది. రవితేజ తో 'ధ‌మాకా'లో న‌టిస్తోంది. త్వ‌ర‌లో అనిల్ రావిపూడి - బాల‌య్య‌ల మూవీలోనూ న‌టించ‌బోతోంది. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు #NTR30లో ఎన్టీఆర్ జోడీగా క‌నిపించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఇద్ద‌రిలో ఒక‌రు ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తార‌ని, మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ న‌టిస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.