మహేష్..బన్నీ..తారక్ తగ్గేదేలే!

Sat Aug 13 2022 10:27:14 GMT+0530 (IST)

Competition between Bunny, Mahesh, Tarak!

సూపర్ స్టార్ మహేష్...స్టైలిష్ స్టార్ అర్జున్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముగ్గురు తగ్గేదేలే! అంటూ దూసుకుపోతున్నారు. అవును ఈ ముగ్గురు వేగం ఒకేలా ఉందిప్పుడు. ఒకరికి ఒకరు పోటీ పడి మరి తమ సినిమాల్ని సెట్స్ కి తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారు. దీన్నీ అదో రకం వేగంగా భావించాలి. తాజా సన్నివేశం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ముందు నువ్వు వెళ్లు . ఆ తర్వాత నీ వెనుక నేనొస్తా. అటుపై నేను రంగంలోకి దిగుతా అంటూ! కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించడంలో  నిమ్మకు నిరెత్తన్నట్లు వ్యవహరిస్తున్నారు.యంగ్ టైగర్ 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తన్నట్లు చాలా కాలం క్రితం  ప్రకటించారు. కానీ ఇంతవరకూ అది పట్టాలెక్కింది లేదు. జూన్ నుంచి ప్రారంభం అవుతుందని ప్రచారం తప్ప  సెట్స్ కి వెళ్లింది లేదు. స్ర్కిప్ట్ పరంగా  మార్పులు చేర్పులు సైతం జరిగాయి. టైగర్ ని అన్ని రకాలుగా ఎలివేట్ చేసేలా కథలో భారీ మార్పులు చేసారు కొరటాల. కానీ సెట్స్ కి వెళ్లడమే ఆలస్యం అవుతుంది.

అటు పాన్ ఇండియా చిత్రం 'పుష్ప-2' విషయంలోనూ ఇదే జరుగుతోంది. బన్నీ 21వ చిత్రంగా సుకుమార్ దీన్ని సెట్స్ పైకి తీసుకె్లబోతున్నారు. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయి ఎనిమిది నెలలు పూర్తయింది. కానీ ఇంత వరకూ రెండవ భాగాన్ని సె టస్ పైకి తీసుకెళ్లలేదు. వాస్తవానికి సెకెండ్ పార్ట్ కటున్యూటీ షూటింగ్ జరుగుతుందని  అన్నారు. కానీ  అలాంటిదేమి జరగలేదు. రెండవ భాగం  కథ సిద్దం చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు సెట్స్ కి వెళ్తారు?  అన్నది  క్లారిటీ ఇచ్చింది లేదు.

మరోవైపు '#ఎస్ ఎస్ ఎంబీ 30'వ సినిమా విషయంలో ఇదే జాప్యం  కొనసాగుతుంది. అమెరికా టూర్ ముగించుకుని  మహేష్ ఇండియాకి వచ్చినా ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తారక్ తరహాలో మహేష్ సైతం స్ర్కిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.  ఈ క్రమంలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడంతా పూర్తయిన ప్రారంభించలేని పరిస్థితి. టాలీవుడ్ లో ఇంకా బంద్ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఉన్నంత కాలం ప్రారంభం అయ్యే అవకాశమూ  లేదు.

ఇలా ముగ్గురు హీరోలు విశ్రాంతి లో ఉండటంతో ఇండస్ర్టీలో చాలా మందికి ఉపాధి  కూడా కరువుతుంది. స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తారు. దీంతో ఆరు నెలలు పాటు  24 శాఖలకు పని ఉంటుంది. కానీ కొత్త ఏడాది ప్రారంభమై ఏడు నెలలు పూర్తయినా ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించకపోవడంతో వాళ్లంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి.

కొన్ని కంపెనీలకు శాశ్వతంగా పనిచేసే టీమ్ లు ఉంటాయి.  వాళ్ల వెనుక ఇంకా ఎంతో మంది సహకార బృందాలు పనిచేస్తాయి. వాళ్లంతా కూడా  సినిమా ప్రారంభం అయ్యే వరకూ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితేనని చిత్రపుర కార్మికులు అంటున్నారు. ఇక ఈ డిలే విషయంలో ముగ్గురు హీరోల అభిమానులు అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.