Begin typing your search above and press return to search.

మూడు డిజాస్టర్లలో కామన్ పాయింట్ ఒకటుంది.. గమనించారా?

By:  Tupaki Desk   |   13 May 2022 6:29 AM GMT
మూడు డిజాస్టర్లలో కామన్ పాయింట్ ఒకటుంది.. గమనించారా?
X
ఎన్నో ఆశలు.. మరెన్నోఅంచనాల మధ్య విడుదలైన మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడటం తెలిసిందే. ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసిన ఈ సినిమాల ఫలితం నిరుత్సాహాన్ని కలిగించేలా మారటం తెలిసిందే.

ఇంతకీ ఆ మూడు సినిమాలేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ ఏడాది దారుణ డిజాస్టర్ అన్నది మొదలైందంటే అది డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ తో మొదలైంది. దాన్ని కంటిన్యూ చేసింది ఆచార్య. బీస్ట్ ఉన్నప్పటికీ.. అది డబ్బింగ్ చిత్రం కాబట్టి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఆచార్య డిజాస్టర్ నుంచి సినీ పరిశ్రమకు కాసింత ఊరట ఇస్తుందని భావించిన సర్కారు వారి పాట కూడా దెబ్బేసినట్లుగా రివ్యూలు చెప్పేస్తున్నాయి. మహేశ్ మీద ఉన్న అభిమానంతో కొందరు మొహమాటం పడుతున్నప్పటికీ.. ఈ సినిమా కూడా హిట్ కాదు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అయితే.. మహేశ్ చేసే మెస్మరైజ్ కారణంగా కాస్త నెట్టుకొచ్చినా.. ఈ వీకెండ్ తర్వాత విషయం ఇట్టే అర్థమైపోతుందంటున్నారు.

వందల కోట్లు వెచ్చించి తీసిన ఈ మూడు పెద్ద సినిమాలు దారుణ డిజాస్టర్ కావటంపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ ట్రోలింగ్.. మీమ్స్ తో హడావుడి నడుస్తోంది. ఆ విషయం జోలికి పోకుండా.. ఈ మూడు సినిమాలో మరో కామన్ పాయింట్ ఒకటి ఉంది. అదేమంటే.. ఈ మూడు సినిమాలకు హీరో కుటుంబ సభ్యులే నిర్మాతల్లో ఒకరు కావటం బిగ్ కో ఇన్సిడెన్స్.

అలాంటి ఈ మూడు సినిమాలు వరుస పెట్టి ప్లాప్ షోలుగా మారిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో నిర్మాతగా మారేటపుడు ఒకటికి పది సార్లు ఆలోచించే అవకాశం ఉంది. ఏమైనా.. మూడు క్రేజీ సినిమాలు వరుసగా డిజాస్టర్ కావటం ఒక ఎత్తు అయితే.. ఆ మూడింటికి ఆ సినిమా హీరోల కుటుంబ సభ్యులు కూడా నిర్మాతలు కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు.