Begin typing your search above and press return to search.

త‌ల్లి కొడుకు బంధం అంటూ నెటిజ‌న్ కామెంట్!

By:  Tupaki Desk   |   23 Oct 2021 2:30 PM GMT
త‌ల్లి కొడుకు బంధం అంటూ నెటిజ‌న్ కామెంట్!
X
మ‌లైకా అరోరా బాలీవుడ్ యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ‌త్యాసం నిరంత‌రం హాట్ టాపిక్. కానీ దానిని ఆ జంట ప‌ట్టించుకోదు. ఎన్నో విమ‌ర్శ‌లు ఎదురైనా వాటికి స్పందించ‌రు. విమ‌ర్శ‌ల్ని ఎంత మాత్రం ప‌ట్టించుకోకుండా కెరీర్ పైనే దృష్టి సారించి ముందుకు సాగిపోతున్నారు. ఈ జంట మ‌ధ్య అన్యోన్య‌త‌ను చూసి కొంత మంది విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌కులుగా మారిపోయారంటే అర్థం చేసుకోవాలి. ఇద్ద‌రు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు.. చ‌రిత్ర‌లో స‌లీం అనార్క‌లీ జంట‌లా మ‌రో ప్రేమ చ‌రిత్ర ఉంటుందంటూ అదే విమ‌ర్శ‌కుల ప్ర‌శంసించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇలా విమ‌ర్శ‌లు..ప్ర‌శంస‌ల న‌డుమ మ‌లైకా- అర్జున్ ప్రేమాయ‌ణం సాగిపోతోంది.

ఎప్ప‌టిక‌ప్పుడు ఈజంట అన్యోన‌త‌ను చాటి చెబుతూ అభిమానుల‌తో ఫోటోలు పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఇద్ద‌రు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఓ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఇందులో స‌ఖుని చెంత స‌ఖి ఇలా కూర్చోని మ‌ధుర‌మైన‌ ద్ర‌వాల్ని తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఓ చ‌ల్ల‌ని సాయంత్రం ఈ జంట ఇలా సేద తీరుతున్నారు. అయితే మ‌లైకా చేతిలో ఉన్న‌ది ఆల్క‌హాల్ గ్లాస్ అంటూ అభిమానులు కొంద‌రు గెస్ చేస్తున్నారు. ప్రియుడి నుదిటిన ముద్దాడుతూ గోముగా త‌ననే చూస్తున్న ప్రేమికురాలిగా మ‌లైకా క‌నిపిస్తోంది. ఇక అలా స‌న్న‌గా చిన్నగా న‌వ్వుతూ ప్రియురాలి ముఖంలో సంతోషాన్ని గ‌మ‌నిస్తున్నాడు అర్జున్. అయితే ఈ ఫోటో చూసిన నెటిజనులు క్యూట్ ఫెయిర్ అంటూ కామెంట్లు చేయ‌గా.. ఓ ఫాలోవ‌ర్ మాత్రం ఇద్ద‌రు త‌ల్లీకొడుకుల్లా ఉన్నారంటూ కామెంట్ చేసాడు.

ప్రేమికులిద్ద‌రు క‌లిసి మందు తాగుతున్న‌ట్లుగా లేదు..త‌ల్లీ కొడుకుల‌ మ‌ధ్య బంధం క‌నిపిస్తోంద‌ని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కి అత్య‌ధికంగా లైక్ లు రావ‌డం విశేషం. అంటే ఈ జంట‌ను ప్రేమికులుగా ఎవ‌రూ అంగీక‌రించ‌డం లేదా..! ఇక మలైకాకు వ‌య‌సు మీద ప‌డ‌టంతో సినిమా అవ‌కాశాలు కూడా పెద్ద‌గా రావ‌డం లేదు. క‌రోనా కార‌ణంగా సినిమాలు టీవీ షోలు త‌గ్గాయి. కొంద‌రు వెట‌ర‌న్ న‌టీమ‌ణులు ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు అందుకుంటున్నా కానీ మ‌లైకాకి ఆ ఛాన్స్ రావ‌డం లేదు. ఇక అర్జున్ క‌పూర్ త‌న సినిమాల‌తో బిజీ న‌టుడిగానే కొన‌సాగుతున్నాడు.