బీజేపీలోకి స్టార్ కమెడియన్?

Tue Oct 20 2020 20:01:57 GMT+0530 (IST)

Star comedian in BJP?

సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ కమెడియన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందర కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడం.. కొత్త కమెడియన్స్ పోటెత్తుతుండడంతో కమెడియన్స్ అంతా ఇటీవల రాజకీయాల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ కమెడియన్ కూడా బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయ్యాడు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వేళైంది. దీంతో అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ బలపడేందుకు స్టార్ ఇమేజ్ ఉన్న వారిని చేర్చుకుంటోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఖుష్బూ బీజేపీలో చేరారు. తాజాగా మరో కమెడియన్ చేరాలని డిసైడ్ అయ్యాడు.

తమిళనాడు బీజేపీ అక్కడి కోలివుడ్ తారలను ఆకర్షిస్తోంది. తాజాగా ఖుష్బూ బాటలోనే ప్రముఖ కమెడియన్ వడివేలు సైతం బీజేపీలో చేరబోతున్నట్టు తమిళనాట జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వడివేలుతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారని.. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారని టాక్. 2011లో వడివేలు డీఎంకే తరుఫున ప్రచారం కూడా చేశాడు. అయితే డీఎంకే ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.