Begin typing your search above and press return to search.

సునీల్‌ ‘DTS’ షురూ.. మోత మోగిస్తాడా..?

By:  Tupaki Desk   |   24 Feb 2021 1:30 PM GMT
సునీల్‌ ‘DTS’ షురూ.. మోత మోగిస్తాడా..?
X
స్టార్ కమెడియన్ గా తెలుగు తెర‌పై ఓ వెలుగు వెలిగిన సునీల్.. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా ట‌ర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే.. ఆ తర్వాత ఆశించిన సక్సెస్ ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటీ రెండు సినిమాలు మోస్తరుగా ఆడినప్పటికీ.. హిట్ టాక్ ను అందుకోలేదు. దీంతో.. కొంత కాలంగా తనలోని హీరోను సైడ్ ట్రాక్ లో పెట్టిన సునీల్.. చిన్న చిన్న వేశాలు కూడా వేశాడు.

అయితే.. లేటెస్ట్ గా తనలోని హీరోను మళ్లీ మెయిన్ ట్రాక్ ఎక్కించాడు. కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు సునీల్. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తిస్తుండడం విశేషం. ఈ సినిమాకు DTS అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే.. చూడగానే ఏదో ఫుల్ జోష్ లో ఉండే కామెడీ ఎంటర్ టైనర్ అవుతుందని భావిస్తుండగా.. ‘డేర్ టు స్లీప్’ అని క్యాప్షన్ ఇచ్చేశారు.

ఈ ట్యాగ్ లైన్ చూస్తుంటే.. ఇదేదో హారర్ మూవీ అని అర్థమవుతోంది. ఈ విధంగా.. టైటిల్ లోనే ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్.. సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ మూవీని తెలుగు, కన్నడలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో శాండల్‌వుడ్ హీరో చేతన్ కూడా నటిస్తున్నాడు. అదేవిధంగా.. కన్నడ బ్యూటీస్ డోనాల్, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిరామ్ పిల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని.. ఎస్ఎస్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ కూడా ఆయనే అందిస్తున్నారు. శ్రీకాంత్ దీపాలా సహ నిర్మాతగా ఉన్నారు.