ప్రభాస్ మాస్ సినిమాలో క్రేజీ కమెడియన్

Wed Jun 29 2022 16:00:01 GMT+0530 (IST)

Comedian Sapthagiri In Salaar Movie

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ కూడా తదుపరి సినిమాలతో మాత్రం మంచి విజయాలు అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. అయితే ప్రభాస్ ఎన్ని సినిమాలు లైన్ లో పెట్టిన కూడా అందరి ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని చెప్పవచ్చు.అందులోనూ కేజీఎఫ్ దర్శకుడు ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తూ ఉండటంతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన లీక్ వైరల్ గా మారుతొంది. ప్రముఖ తెలుగు కమెడియన్ సప్తగిరి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.

ఈ సినిమాలో కామెడీగానే కాకుండా కాస్త సీరియస్ గా ఉండే సన్నివేశాల్లో కూడా సప్తగిరి హైలెట్ కాబోతున్నట్లు గా తెలుస్తోంది. మొత్తంగా సప్తగిరి సలార్ సినిమా షూటింగ్ కోసం 30 రోజుల షెడ్యూల్ కేటాయించాడట. అన్ని రోజులు అంటే తప్పకుండా సినిమాలో అతని పాత్ర ఫుల్ లెన్త్ లో ఉంటుంది అని అనిపిస్తోంది. చాలా కాలంగా సప్తగిరి కూడా పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.

ఒకవేళ వచ్చినా కూడా అవి అంతగా క్లిక్ కావడం లేదు. మాస్ లో అతనికి మంచి క్రేజ్ ఉన్నప్పటికి కూడా సరైన పాత్రలు తగలకపోవడం వలన వర్కౌట్ అవ్వడం లేదు. సలార్ సినిమాలో మాత్రం అతని పాత్ర అద్భుతంగా ఉంటుంది అని టాక్ అయితే వస్తోంది. దర్శకుడు 30 రోజుల వరకు అతని డేట్స్ తీసుకున్నారు అంటే తప్పకుండా క్యారెక్టర్లో కంటెంట్ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఇక సలార్ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ పై కూడా దర్శకుడి నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.