Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఇవి ఖతర్నాక్ కిస్సులట!

By:  Tupaki Desk   |   24 Jan 2020 11:13 AM GMT
బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఇవి ఖతర్నాక్ కిస్సులట!
X
ముద్దు అనగానే జనాలకు ఎక్కడలేని ఆసక్తి. అందులోనూ ఖతర్నాక్ కిస్సులు అనే టైటిల్ చూడగానే మనసు చదవాలని ఆరాటపడుతూ ఉంటుంది. కిస్సుల టాపిక్ వచ్చింది కాబట్టి అసలు టాపిక్ లోకి పోయే ముందు ఒక ముద్దు పాట గురించి ప్రస్తావించుకోవాలి. మన తెలుగు సినిమాల్లో ఎన్నో ముద్దు పాటలు ఉన్నాయి కానీ వాటికి ఇది తాత లాంటింది. బాలయ్య ఫ్లాప్ మూవీ అయిన 'పాండురంగడు' సినిమాలో 'ప్రేమవలంబనం ప్రియ చుంబనం' అనే పాట ఉంది.

ముద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ ఈ పాట సాహిత్యంలో ప్రస్తావిస్తారు. ఇదంతా భారతీయతే! ఒక్కో ముద్దుకు ఒక్కో పేరు.. పెట్టేది ఒక్కో తీరు.. బాలయ్య ఎంతో మొహంతో శృంగార రసాస్వాదన చేస్తూ హీరోయిన్ టబుకు ముద్దుల వర్షం కురిపిస్తారు. ఈ లిరిక్స్ లో ముద్దుల రకాలు.. వాటి పేర్లు ఉన్నాయి. తీరిక ఓపిక ఉంటే మాత్రం అర్థాలు తెలుసుకొని పాటను వినండి. బాలయ్యే కదా అని తేలిగ్గా తీసేసేవారికి మనమేం చెప్పలేం. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే టా లీవుడ్ లో మేకర్లు కూడా కిస్సుల ప్రచారానికి ఎంతో కృషి చేశారని తెలుసుకునేందుకే.

సరే ఇక టాపిక్ లోకి వెళ్తే.. 'మలంగ్' సినిమా పోస్టర్ ఈమధ్య సంచలనం సృష్టించింది. హీరో ఆదిత్య రాయ్ కపూర్ నిలుచుని ఉంటే దిశా పటాని ఆయన భుజాల పై వయ్యారంగా కూర్చుని పెదవి ముద్దు అందిస్తుంది. ఈ ముద్దు దెబ్బకు 'మలంగ్ సినిమాకు సూపర్ పాపులారిటీ వచ్చింది.

'జలేబి' అనే టైటిల్ తో 2018 లో ఒక హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాలో రియా చక్రబర్తి.. వరుణ్ మిత్రాల ట్రైన్ విండో కిస్సు కూడా సూపర్ పాపులర్. మనిషి అయినవాడు ఈ పోస్టర్ ను ఒక సారి చూస్తే మర్చిపోవడం అసాధ్యం!

ఇక బాలీవుడ్ లో ముద్దుల పితామహుడు.. సీరియస్ సీరియల్ కిస్సర్ అయిన ఇమ్రాన్ హష్మి అప్పటి హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కు 'మర్డర్' లో ఇచ్చిన కిస్సు ఒక క్లాసిక్ కిస్సట.

'రాజా హిందుస్తానీ' సినిమాలో అమీర్ ఖాన్ - కరిష్మా కపూర్ల పెదవి ముద్దు బాలీవుడ్ లోని లాంగెస్ట్ కిస్సులలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కిస్సులు కామన్ అయ్యాయి కానీ ఈ కిస్సు 1996 లో సంచలనం సృష్టించింది. ఎంతో మంది సంప్రదాయవాదులు అప్పట్లో కస్సుబస్సులాడిన కిస్సు ఇది.

'జబ్ తక్ హై జాన్' లో షారూఖ్ ఖాన్.. కత్రినాల మధ్య వచ్చే లిప్ లాక్ కూడా మేలు రకం మూతిముద్దులలో ఒకటని బాలీవుడ్ తత్వవేత్తలు చెప్తూ ఉంటారు.

2007 లో రిలీజ్ అయిన 'జబ్ వి మెట్' సినిమాలో షాహిద్ కపూర్.. కరీనా కపూర్ ల అధర చుంబనం అప్పటి యూతును పిచ్చెక్కించింది.

'ధూమ్ 2' లో హృతిక్ రోషన్-ఐశ్వర్య రాయ్ ల మధ్య వచ్చే ఫ్రెంచ్ కిస్సు బాలీవుడ్ లో వచ్చిన స్టైలిష్ కిస్సులలో ఒకటిగా పేరెన్నికగన్నది!

సంజయ్ భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'రామ్ లీలా' సినిమా 2013 లో విడుదలయింది. ఆ సినిమాలో రణవీర్ సింగ్-దీపిక పదుకొనె మధ్య వచ్చే ముద్దు సూపర్ హాట్ అని చాలామంది చెప్తూ ఉంటారు.

ఇక 'కబీర్ సింగ్' లో షాహిద్ కపూర్ - కియారా అద్వానిలు ఇద్దరూ తమ ముద్దుతో హిందీ సినిమా ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు.

ఇలా ఎంతోమంది బాలీవుడ్ హీరో హీరోయిన్లు.. ఫిలిం మేకర్లు ముద్దుల ఉద్యమాన్ని ఆ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు. బాలీవుడ్లో ఎవరు ఎలా ఉన్నా ఎన్ని కిస్సులు పెట్టుకున్నా.. 'పాండురంగడు' బాలయ్య కిస్సుల ముందు మాత్రం బలాదూరే..!