డిసెంబర్ లో రకుల్ పెళ్లి పై క్లారిటీ వచ్చేసింది!

Tue Nov 23 2021 22:00:01 GMT+0530 (IST)

Clarity on Rakul wedding in December

రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత-నటుడు జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రకుల్ అధికారికంగా రివీల్ చేసింది. నాటి నుంచి ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటూ ఒకటే మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. పెళ్లిపై ప్రచారం అంతకంతకు పెరిగిపోతుంది.ఈ డిసెంబర్ లోనే ఈ జంట జీవితంలోకి అడుగు పెడుతున్నారంటూ.. సరైన ముహుర్తం కూడా పెద్దలు చూసారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మళ్లీ కరోనా ఎలా విరుచకుపడుతుంతో తెలియదు. వచ్చే ఏడాది మార్చి వరకూ మళ్లీ ముహుర్తాలు కూడా ఉండవు.

ఈలోగానే పెళ్లి తంతు పూర్తిచేయాలని పెద్దలు స్ర్టాంగ్ ఉన్నట్లు మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. తాజాగా వీటన్నింటిపై రకుల్ వివరణ ఇచ్చింది. పెళ్లి అనేది నా మనసులోకి రాలేదు. ప్రేమలో ఉన్న మాట వాస్తవం. కానీ పెళ్లి ఎప్పుడో తెలియదు. చేసుకుంటే ముందు ఆ విషయాన్ని మీడియాకి వెల్లడిస్తా.

పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న వారికే అందరికంటే ముందుగా చెబుతా. అందులో ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. ప్రస్తుతానికి కెరర్ పైనే దృష్టి పెట్టా. ఇలాంటి వార్తలు తరుచూ నాపై వస్తూనే ఉన్నాయి. నాకు రిప్లై ఇవ్వాలనిపిస్తేనే ఇస్తా లేకపోతే స్పందించనని తెలిపింది.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది.

ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో కొత్త అవకాశాలైతే ఇంకా చేజిక్కించుకోలేదు.