క్లిక్ క్లిక్ : బొద్దుగా అయినా ముద్దుగానే ఉంది

Mon Sep 13 2021 23:00:01 GMT+0530 (IST)

Chubby but cute

2005 సంవత్సరంలో నవదీప్ హీరోగా నటించిన 'మొదటి సినిమా' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనం బజ్వ. తెలుగు లో కొన్నాళ్ల పాటు ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్ లు దక్కలేదు. దాంతో ఈ అమ్మడికి తెలుగు లో మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఈమద్య కాలంలో తెలుగు లో ఫుల్ లెంగ్త్ పాత్రలేమి ఈమె చేయలేదు. కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లకు పైగానే పూర్తి అయినా కూడా ఇప్పటికి కూడా పూనం తమిళ్ లేదా మలయాళంలో అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. కెరీర్ లో ఎక్కడ స్టాప్ పడకుండా నెట్టుకు వస్తున్న ఈ అమ్మడు ఇప్పటికి కూడా జనాల్లో గుర్తింపు కలిగి ఉంది అంటే సోషల్ మీడియా లో ఈమె షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలు.ఇన్ స్టా గ్రామ్ లో రెగ్యులర్ గా ఈ అమ్మడు ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దాదాపుగా రెండున్నర మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను నెట్టింట వదులుతూనే ఉంది. తాజాగా మరోసారి ఆమె తన క్యూట్ హాట్ థైస్ ఫొటోలను షేర్ చేసింది. ఈమద్య కాలంలో ఈ అమ్మడు కాస్త లావు అయినట్లుగా అనిపిస్తుంది. కెరీర్ ఆరంభంలో చాలా సన్నగా ఉన్న పూనం మద్యలో కాస్త లావు అయ్యింది. సినిమాల్లో ఆఫర్ల కోసం బరువు తగ్గింది. మళ్లీ ఇప్పుడు కాస్త బరువు పెరిగినట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పూనం బజ్వా బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉందని.. ఆమె థైస్ బ్యూటీతో పాటు క్లీవేజ్ షో తో అదరగొడుతోంది. అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్న ఈమె బొద్దు అందాలు తెలుగు మేకర్స్ కంట్లో పడితే ఖచ్చితంగా మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. హీరోయిన్ గా కాకున్నా సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పూనం తెలుగు ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది. తెలుగు లో ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా లేదంటే మెల్ల మెల్లగా పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. పూనం తెలుగు లో చివరగా ఎన్టీఆర్ కథానాయుడు సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించింది. అది గెస్ట్ రోల్. హీరోయిన్ గా తెలుగులో చేయక చాలా ఏళ్లు అవుతుంది. అయినా కూడా సోషల్ మీడియాలో ఈమె ఫొటోల కారణంగా జనాలు ఇంకా కూడా గుర్తు పడుతూనే ఉన్నారు.