తెలుగు ప్రేక్షకులపై తమిళ హీరో షాకింగ్ కామెంట్స్!

Sat Sep 24 2022 15:29:41 GMT+0530 (India Standard Time)

Chiyaan Vikram Shocking comments on Telugu Audience!

విఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ కార్తి జయం రవి ప్రకాశ్ రాజ్ ఐశ్వర్యా రాయ్ త్రిష జయరామ్ ఐశ్వర్య లక్ష్మి శరత్‌కుమార్ విక్రమ్ ప్రభు శోభిత ధూళిపాళ.. లాంటి స్టార్ యాక్టర్స్ తో భారీ ఎత్తున వస్తున్న సినిమా.. 'పొన్నియిన్ సెల్వన్ 1'. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా తమిళనాడును 1000 వేళ్ల క్రితం పరిపాలించిన చోళుల కథతో ఈ సినిమా వస్తోంది. బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప కేజీఎఫ్‌ల మాదరిగా పొన్నియిన్ సెల్వన్ సైతం సూపర్ హిట్టుగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ట్రైలర్ పాటలతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందులోనూ తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

కాగా పొన్నియన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి పార్ట్.. పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ఆ సినిమాలో నటించినవారంతా హైదరాబాద్ రావడంతో సందడి నెలకొంది.

ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1' సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీంతో స్టార్లంతా హైదరాబాద్ లో సందడి చేశారు.

ఈ సందర్భంగా హీరో విక్రమ్ (అపరిచితుడు శివపుత్రుడు ఫేమ్) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు కాదని.. సినిమా పిచ్చివాళ్లని హాట్ కామెంట్స్ చేశారు. విక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ ఈవెంట్లోనే ఇంకా మాట్లాడిన విక్రమ్.. సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఒక్కో సినిమాలో ఒక్కో నటన చేశానని గుర్తు చేశారు. అయితే పొన్నియన్ సెల్వన్ లో ఒకే ఒక్క షాట్ లో గుర్రం మీద వస్తున్నప్పుడు బాగా చేశాను అని అనిపించిందన్నారు. ఇంతమంది హీరోలు హీరోయిన్లు కలిసి ఒక సినిమాలో చేయడం గొప్ప విషయమని  విక్రమ్ చెప్పారు. అందులోనూ ఇంతమంది కలిసి ఒక సినిమాలో చేయడం రికార్డ్ అని తెలిపారు. మణిరత్నం సినిమా కావడం వల్లే.. ఆయన సినిమాలో నటించాలనే ఇంతమంది కలసి ఈ సినిమా చేశామన్నారు. మణిరత్నం గారి మళ్ళీ మళ్ళీ కలసి పనిచేయాలనేది తన కల అని విక్రమ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.