Begin typing your search above and press return to search.

అర‌ణ్య నుంచి చిటికేసే ఆ చిరుగాలి సాంగ్

By:  Tupaki Desk   |   6 March 2021 11:39 AM GMT
అర‌ణ్య నుంచి చిటికేసే ఆ చిరుగాలి సాంగ్
X
రానా దగ్గుబాటి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం `అరణ్య`. ప్ర‌భు సోల్మ‌న్ ద‌ర్శ‌కుడు. మార్చి 26న‌ హిందీ- తమిళం- తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్ప‌టికే రిలీజైన రానా పోస్ట‌ర్లు.. టీజ‌ర్ కి చ‌క్క‌ని స్పంద‌న ల‌భించింది.

ఈ చిత్రంలో రానా తో పాటు తమిళ నటుడు విష్ణు విశాల్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏనుగులు ప‌ర్వ‌తాలు అడ‌వులు గిరిజ‌నులు అంటూ ఈ సినిమాలో చాలా మ్యాట‌ర్ క‌నిపిస్తోంది. ఈ సినిమాలో ఏనుగులే ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయి. రానా- విష్ణు విశాల్ పాత్ర‌లు పూర్తిగా అడవితో క‌నెక్టివిటీ ఉన్న‌వి కావ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. అడ‌విలో మృగాల్ని వేటాడే మ‌నుషుల‌కు దానిని వ్య‌తిరేకించే క‌థానాయ‌కుడికి మ‌ధ్య వార్ నేప‌థ్యంలోని చిత్ర‌మిద‌ని ప్ర‌చార‌మైంది. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జె‌ట్ తో నిర్మిస్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి చిటికేసే ఆ చిరుగాలి లిరిక‌ల్ వీడియో విడుద‌లైంది. సాంగ్ ఆద్యంతం ప‌చ్చ‌ని అడ‌విలో గిరిజ‌న గ్రామంలో అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా రానా శివ‌పుత్రుడు త‌ర‌హా గెట‌ప్ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌నిపిస్తున్నారు. గిరిజ‌నుల‌కు ఏనుగుల‌కు ఏ హానీ ఎదుర‌వ్వ‌కుండా కాపాడే యువ‌కుడి క‌థ‌ని ఈ లిరిక‌ల్ వీడియో చెబుతోంది. ఇందులో జియా.. శ్రీయ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్ని పోషించారు. సేవ్ ది ఎలిఫేంట్స్ ట్యాగ్ తో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.