Begin typing your search above and press return to search.

13 ఏళ్ల కెరీర్ జ‌ర్నీలో చెర్రీ అంచెలంచెలుగా...!

By:  Tupaki Desk   |   28 Sep 2020 3:30 PM GMT
13 ఏళ్ల కెరీర్ జ‌ర్నీలో చెర్రీ అంచెలంచెలుగా...!
X
ఒక్క అడుగుతోనే ఎంత దూర‌మైనా చేరేది. ఒక్క అడుగుతోనే శిఖ‌రం అంచును చేరుకోగ‌లిగేది. అలా త‌మ జీవితంలో ప‌డిన మొద‌టి అడుగును ఏ స్టార్ కూడా మ‌ర్చిపోలేరు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అందుకు మిన‌హాయింపేమీ కాదు. నేటితో ఆయ‌న న‌టించిన చిరుత రిలీజై 13 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా నాటి జ్ఞాప‌కాల్లోకి వెళుతూ ఒక రేర్ ఫోటోని షేర్ చేశారు చ‌ర‌ణ్‌.

ఇందులో చ‌ర‌ణ్ ఎంతో యూత్ ఫుల్ గా ఎన‌ర్జిటిక్ బోయ్ లాగా క‌నిపిస్తున్నాడు. అప్ప‌టికి కాలేజ్ ఏజ్.. అంత‌గా ప‌రిణ‌తి ఉండ‌ని ఏజ్ కూడా అదే. కానీ చెర్రీ అంచెలంచెలుగా త‌న‌ని తాను మ‌లుచుకున్న తీరు మెస్మ‌రైజింగ్ అనే చెప్పాలి. ఇక న‌టించిన రెండో సినిమా మ‌గ‌ధీర‌తో సంచ‌ల‌నాలే సృష్టించాడు. కెరీర్ లో ఎన్నో వైఫ‌ల్యాలు ఉన్నా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో చెల‌రేగాడు. రంగ‌స్థ‌లం చిత్రంతో అత‌డు మ‌రో మైలు రాయిని అందుకున్నాడు. ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ కి చెర్రీ ప‌క్కాగా స‌రిపోతాడు అని చిట్టిబాబు పాత్ర‌తో నిరూపించాడు. ధృవ చిత్రంతో క్లాసీ యాక్ష‌న్ చిత్రాల‌తో దుమారం రేపుతాడ‌ని ప్రూవైంది.

చెర్రీ ఎదుగుద‌ల చూసి గ‌ర్వించే స్థాయి చిరంజీవికి ఉందిప్పుడు. నిర్మాత‌గా చ‌ర‌ణ్ ఏకంగా చిరంజీవి స్థాయినే నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటే ఇంత‌కంటే ఆనందం ఇంకేం కావాలి ఆ డాడీకి.`చిరుత` విడుదలై నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయిన‌ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాను చెర్రీ గుర్తు చేసుకున్నాడు.

``అప్పుడే 13 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు.. అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్ని వేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను`` అని ట్వీట్ చేశాడు. నేడు చిరుత ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపాడు చ‌ర‌ణ్‌.