చిరు మొదటి దర్శకుడి ఆర్థిక అవస్థలు

Fri Nov 15 2019 15:24:54 GMT+0530 (IST)

Chiru's first director's finance Problems

ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. అయితే వారిలో చాలా మందికి మొదటి అవకాశం అంత సులభంగా రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత అవకాశాలు పొంది ఉంటారు. మొదటి అవకాశం ఇచ్చిన వారిని దేవుడు అంటారు. ఒక అవకాశం దక్కితేనే కదా నిరూపించుకునేది. ఆ అవకాశం ఎవరైతే ఇస్తారో వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి మెగాస్టార్ గా వెలుగు వెలుగుతూ ఇండియాలోనే టాప్ స్టార్ గా నిలిచాడు. చిరంజీవి కూడా కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అలాంటి చిరంజీవికి మొదటి అవకాశంను ఇచ్చింది గూడపాటి రాజ్ కుమార్.పునాది రాళ్లు అనే చిత్రంలో ఒక హీరోగా చిరంజీవికి గూడపాటి రాజ్ కుమార్ చాన్స్ ఇచ్చాడు. ఇంకా ఎంతో మందికి అప్పట్లో ఆఫర్లు ఇచ్చి లైఫ్ ఇచ్చిన దర్శకుడు గూడపాటి. అలాంటి గూడపాటి రాజ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. కొడుకు అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరి అయిన గూఢపాటి ఇటీవలే భార్య కూడా మృతి చెందడంతో తోడు లేని జీవి అయ్యాడు. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటున్న ఈ దర్శకుడు హాస్పిటల్ లో చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక.. ఇల్లు అద్దె కట్టలేక నానా అవస్థలు పడుతున్నాడట.

మొదటి సినిమాతోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు గూడపాటి ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చేశాడు. అయితే ప్రస్తుతం మాదిరిగా దర్శకులకు గతంలో భారీ పారితోషికాలు లేవు. అందుకే గూడపాటి గారు పెద్దగా సంపాదించుకోలేక పోయారు. అందుకే ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఎవరైనా సాయం చేయాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు.