Begin typing your search above and press return to search.

చిరు వ‌ర్సెస్ బాలయ్య‌.. శ్రుతి ఎవ‌రితో బెస్ట్?

By:  Tupaki Desk   |   30 Nov 2022 2:30 AM GMT
చిరు వ‌ర్సెస్ బాలయ్య‌.. శ్రుతి ఎవ‌రితో బెస్ట్?
X
లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ త‌న తండ్రి వ‌యసుకు స‌మాన వ‌య‌సు ఉన్న ఇద్ద‌రు తెలుగు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించ‌డం గుస‌గుస‌ల‌కు తావిస్తోంది. ఎన్‌.బి.కె స‌ర‌స‌న `వీరసింహా రెడ్డి`  మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `వాల్తేరు వీరయ్య`లో న‌టిస్తోంది. ఇవి రెండూ 2023 సంక్రాంతి (పొంగల్‌) బ‌రిలో విడుదల కానున్నాయి. వీటితో పాటు ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ స‌లార్ లోను శ్రుతి న‌టిస్తోంది.

ఇక సంక్రాంతి బ‌రిలో రానున్న రెండు సినిమాలు నువ్వా నేనా? అంటూ ఢీకి రెడీ అవుతుండగా ఈ రెండిటిలోను జాక్ పాట్ కొట్టేసిన శ్రుతి ఆ ఇద్ద‌రు హీరోల్లో ఎవ‌రికి యాప్ట్? అంటూ ఫ్యాన్స్ న‌డుమ సోష‌ల్ మీడియా డిబేట్ కొన‌సాగుతోంది.

ఇరువురు 60 ప్ల‌స్ ఏజ్ హీరోల స‌ర‌స‌న 30 ప్ల‌స్ శ్రుతి ఎలా క‌నిపించ‌బోతోంది? అన్న‌ది కూడా చ‌ర్చ‌గా మారింది. సంక్రాంతి హీరోల్లో ఇద్ద‌రిలో ఎవ‌రితో శ్రుతి బెస్ట్.. ఎవ‌రికి యాప్ట్? అంటూ ర‌క‌ర‌కాలుగా ఫ్యాన్స్ లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే శ్రుతిహాస‌న్ స‌లార్ లాంటి క్రేజీ చిత్రంలో న‌టిస్తూ ప్ర‌భాస్ అభిమానుల‌కు ద‌గ్గ‌రైపోయింది.  అలాగే ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ `దే ఐ`లో కూడా ప్ర‌ధాన పాత్రను పోషిస్తోంది.

కొత్త ప్రియుడితో డేటింగ్ ..

ఇక శ్రుతిలో మ‌ల్టీ ట్యాలెంట్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. క‌థానాయిక‌గా న‌టన‌లో కొన‌సాగుతూనే సంగీత పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇటీవ‌ల శ్రుతి తిరిగి న‌టిగా బిజీ అయ్యింది. వ‌ర‌స చిత్రాల్లో న‌టించేస్తోంది. మ‌రోవైపు విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక డూడుల్ ఆర్టిస్టు శంత‌ను హ‌జారికాతో శ్రుతి డేటింగ్ హాట్ టాపిక్ గా మారింది.

వీర‌య్య లో శ్రుతి సీన్ హైలైట్ ..!

2023 సంక్రాంతి సినిమా `వాల్తేరు వీరయ్య` తాజా అప్ డేట్స్ మెగాభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి  క‌థానాయ‌కుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా కీలక పాత్ర పోషిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఓ కీలక షెడ్యూల్ ని ముగించాడు. చిరంజీవితో ఆయన చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంద‌ని టీమ్ చెబుతోంది. అలాగే శ్రుతిహాస‌న్ కి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర ల‌భించింద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.