వీడియో: జస్ట్ 35 ప్లస్ అంటే నమ్మేస్తారు అన్నయ్యా

Mon Aug 03 2020 18:00:33 GMT+0530 (IST)

Video: Just 35 plus means trust me brother

రాఖీ పండగకు ఉన్న విశిష్ఠత తెలిసినదే. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. సినీతారలు తమ ప్రియమైనవారితో రాఖీ పండగను జరుపుకున్న ఫోటోల్ని షేర్ చేస్తూ ఉంటే వాటికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అన్నయ్యకు అక్క చెల్లెమ్మలు స్వీట్ తినిపిస్తూ రాఖీ కట్టారు. చిరు కుటుంబంలో ఇది ప్రతియేటా చూస్తున్నదే. సిస్టర్స్ అన్నయ్యకు రాఖీ కట్టి అన్నయ్య ఆశీర్వాదాలను తీసుకోవడం ఆనవాయితీ. అన్నట్టు ఈ వీడియోలో చిరు జస్ట్ 35 ప్లస్ అన్నంత యంగ్ గా కనిపిస్తున్నారు. చిన్నపాటి గడ్డంతో స్పెషల్ హెయిర్ కట్ తో లుక్ మొత్తం మార్చేశారు. ఈ లుక్ కి మెగా ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో లక్షలాది ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

ఈ క్వారంటైన్ సమయంలో చిరు ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులంతా చిరుతో పాటు గొప్ప విలువైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. కోవిడ్ వల్ల ఆచార్య షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. జనవరి వరకూ సెట్స్ కెళ్లే వీలు కనిపించడం లేదు. అప్పటివరకూ చిరు కుటుంబ పండుగలతోనే కాలం గడిపేయనున్నారు. మరోవైపు సీసీసీ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.